నాగశౌర్య కోసం ఇద్దరు దర్శకుల తాపత్రయం

55
Nagasourya movie
Nagasourya movie

Nagasourya movie

కెరీర్ ప్రారంభించి చాలాకాలమే అయినా చెప్పుకోదగ్గ హిట్స్ అతి తక్కువగా ఉన్న హీరోలు చాలామందే ఉన్నారు. అయితే ఆఫర్స్ విషయంలో మాత్రం వీళ్లు ప్రతిసారీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. అలాంటి వారిలో నాగశౌర్య ఒకడు. ఊహలు గుసగుసలాడే, కళ్యాణ వైభోగమే, ఛలో అంటూ వేళ్లపై లెక్కించే విజయాలు మాత్రమే ఉన్న శౌర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. లేటెస్ట్ గా మరో కొత్త ప్రాజెక్ట్ కూడా ఓకే అయింది. నాగశౌర్య విజయం కోసం కొందరు కుర్ర హీరోల్లాగా సొంతంగా బ్యానర్ స్థాపించి సక్సెస్ అయ్యాడు. ఛలోతో సూపర్ హిట్ అందుకున్నాడు. కానీ ఆ ఊపును కంటిన్యూ చేయడంలో మాత్రం తడబడ్డాడు. అటు సొంత బ్యానర్ లో సమస్యలు వచ్చాయి. దీంతో పాటు సొంత సినిమా అయితే ఒకలా.. బయటి మూవీ అయితే మరోలా బిహేవ్ చేస్తాడనే విమర్శలూ వచ్చాయి. అవన్నీ ఎలా ఉన్నా ఆఫర్స్ విషయంలో శౌర్య దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా లాక్ డౌన్ టైమ్ లో తను చేస్తోన్న ఓ సినిమా కోసం ఎయిట్ ప్యాక్ చేశాడు. ఆర్చరీ నేపథ్యంలో సాగే సినిమా ఇది. లేటెస్ట్ గా నాగశౌర్య మరో సినిమాకు ఓకే చెప్పాడు.

సినిమా చూపిస్తమామా, నేను లోకల్ వంటి హిట్ మూవీస్ అందించిన త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పాడు. అయితే త్రినాథరావు ఈ సినిమా కంటే ముందే రవితేజతో ఓ మూవీ కమిట్ అయ్యాడు. రవితేజ చేతిలో మూడు నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయిప్పుడు. దీంతో త్రినాథరావు సినిమా లైన్ లోకి వచ్చే సరికి టైమ్ పడుతుంది. అందుకే అతను ఈ గ్యాప్ లో శౌర్యకు ఓ కథ చెప్పాడు. అతనికి నచ్చడంతో ప్రాజెక్ట్ కన్ఫార్మ్ అయింది. విశేషం ఏంటంటే.. త్రినాథరావు డైరెక్షన్ లో నాగశౌర్య హీరోగా నటించే సినిమాకు కథ, స్క్రీన్ ప్లేను దర్శకుడు అనిల్ రావిపూడ అందిస్తున్నాడు. ఎంటర్టైనింగ్ స్టోరీస్ కు ఎడ్రెస్ అయిన అనిల్ తో పాటు ఎలాంటి కథైనా ఎంటర్టైనింగ్ చెప్పే త్రినాథరావు కాంబోలో నాగశౌర్యకు మంచి హిట్ పడటం గ్యారెంటీ అంటున్నారు. పైగా ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. మొత్తంగా రవితేజ కంటే ముందే త్రినాథరావు ఈ యంగ్ స్టర్ తో సినిమా చేయబోతున్నాడు. మరి కాంబో అంచనాలకు తగ్గట్టుగా పెద్ద విజయం అందుకుంటారేమో చూడాలి.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here