లోక్ సభలో రేవంత్ అరెస్ట్ రగడ … రేవంత్ తీరుపై నామా ఫైర్

165
nama fired on revanth
nama fired on revanth

name fired on revanth

టీఆర్ ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు లోక్ సభ వేదికగా మల్కాజ్ గిరి ఎంపీ , కాంగ్రెస్ పార్టీ నేత అయిన రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. చట్టాలు రూపొందించే సభలో చట్ట సభ్యుడిగా ఉండి ఆ చట్టాలనే ఉల్లంఘించడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు. రేవంత్ రెడ్డి ఏస్ట్ వ్యవహారం లోక్ సభలో నేడు దుమారం రేపింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్ సభలో రేవంత్ అరెస్ట్ పై మాట్లాడిన క్రమంలో నామా స్పందించారు. రేవంత్ తీరుపై లోక్ సభలో మండిపడ్డారు . రేవంత్ అరెస్ట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లేవనెత్తిన అభ్యంతరాలకు టీఆర్ఎస్ ఎంపీ ధీటుగా సమాధానాలిచ్చారు.

చట్టం తయారు చేసే వారే ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎలా అని ప్రైవేట్ ప్రాపర్టీల వద్ద డ్రోన్‌లు ఎగిరేయడమనేది  ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ ప్రకారం నేరమని నామా నాగేశ్వర్ రావు అన్నారు. మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్న ప్రదేశంలో రేవంత్ అనుచరులు డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారని ఇది ఓ వ్యక్తి ప్రైవసీని దెబ్బతీయడమేనన్నారు. డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన వ్యక్తి  సమాచారం మేరకే పోలీసులు రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేశారన్నారు. చట్ట ప్రకారమే పోలీసులు రేవంత్ రెడ్డిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారన్నారు. ప్రస్తుతం ఈ కేసు వ్యవహారం న్యాయస్థానంలో ఉందని దీనిపై ఇంతకుమించి మాట్లాడటం సరికాదన్నారు.

ts politics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here