మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి బాల‌య్య క్లారిటీ

Nandhamuri Balakrishna Clarity about Mokshagna Entry
నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ సినీ రంగ ప్ర‌వేశం గురించి బాల‌కృష్ణ ఓ క్లారిటీ ఇచ్చారు. బాల‌య్య నిర్మాత‌గా ఎన్‌.బి.కె.ఫిలింస్ బ్యాన‌ర్‌పైనే మోక్ష‌జ్ఞ సినిమా ఉంటుందట‌. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ త‌న తండ్రి బ‌యోపిక్ `య‌న్‌.టి.ఆర్‌` విడుద‌ల‌తో బిజి బిజీగా ఉన్నారు. అది ముగియగానే బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ సెట్స్‌కు వెళ్ల‌నుంది. ఈ సినిమా పూర్త‌యిన త‌ర్వాతే మోక్ష‌జ్ఞ సినిమా గురించి బాల‌కృష్ణ ఆలోచిస్తాడ‌ట‌.
బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ నిర్మిస్తోన్న ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో తొలి భాగం `య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు` జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానుంది. కాగా సెకండ్ పార్ట్ `య‌న్.టి.ఆర్ మ‌హానాయ‌కుడు`లో ప్యాచ్ వ‌ర్క్ మిన‌హా అంతా పూర్త‌య్యింది. ఈ ప్యాచ్ వ‌ర్క్‌ను జ‌న‌వ‌రి 12 నుండి 25 వ‌ర‌కు పూర్తి చేసేసి ఫిబ్ర‌వ‌రి 7న ఈ రెండో భాగాన్ని విడుద‌ల చేస్తున్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article