ఏంటి నానీ.. నిజ‌మేనా?

Budget of Nani Movie with Vikram K Kumar
విక్ర‌మ్.కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నాని న‌టింబోయే సినిమా బ‌ట్జెట్ ఎంతో తెలుసా?  ఈ సినిమా నిర్మాత‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్ ఇప్పుడు ఈ సినిమా బ‌డ్జెట్‌ను…అమాంతం పెంచేశారు. అదేంటి?  మైత్రీ మూవీస్ సాయిధ‌ర‌మ్‌తేజ్ బ‌డ్జెట్‌ను పాతిక నుంచి 15 చేశారుగా. మ‌రి నానికి మాత్రం ఎందుకు పెంచారు? అని అంటే రీజ‌న్స్ బోలెడు. ఎందుకంటే నాని రైజ్ మీదున్నాడు. ఆయ‌న `జెర్సీ` సినిమా 35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇంకా శాటిలైట్స్ నిర్మాత‌ల చేతిలోనే ఉన్నాయి. అంటే నాని క్రేజ్ నానాటికీ పెరుగుతోంద‌న్న‌మాట‌. మ‌రోవైపు విక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం అనగానే తెలుగు జ‌నాల్లో కాస్త పేరుంది. సో ఆ పేరును క్యాష్ చేసుకోవ‌డానికి, కాస్త బ‌డ్జెట్ పెరిగినా ఫ‌ర్వాలేద‌ని మైత్రీ నిర్మాత‌లు ర‌విశంక‌ర్‌, న‌వీన్ ఎర్నేని, సీవీ మోహ‌న్ నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. సాయిధ‌ర‌మ్‌తేజ్ కి ఈ మ‌ధ్య అస‌లు హిట్స్ లేక‌పోవ‌డంతో ఆయ‌నతో తెర‌కెక్కిస్తున్న `చిత్ర‌ల‌హ‌రి`ని వీలున్నంత త‌క్కువ బ‌డ్జెట్‌లో చేసేసి విడుద‌ల చేసి, లాభాలు సంపాదించాల‌న్న‌ది ప్లాన్‌.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article