నాని సినిమా అంత చేస్తుందా?

Will Nani Cinema Cost that Much
వ‌రుస విజ‌యాల మీదున్న హీరో నానికి `కృష్ణార్జున యుద్ధం` బ్రేక్ వేసింది. ఇప్పుడు గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో `జెర్సీ` సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది. ముప్పై ఆరేళ్ల వ్య‌క్తి ఇండియ‌న్ క్రికెట్ టీం త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించాల‌నుకుని చేసే ప్ర‌య‌త్నంలో అత‌ను చేసే ప్ర‌య‌త్నాల ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుద‌ల కానుంది. ఈ సినిమా ఓవ‌ర్ సీస్ హ‌క్కుల‌ను 5 కోట్ల రూపాయ‌ల‌కు అమ్మడానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. అయితే నాని చిత్రాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు భ‌లేభ‌లేమ‌గాడివోయ్ చిత్రం 1.4 మిలియ‌న్ డాల‌ర్స్‌ను వ‌సూలు చేసింది. ఇప్పుడు నిర్మాత‌లు చెప్పిన రేటుకు ఓవ‌ర్‌సీస్‌లో బిజినెస్ జ‌ర‌గాలంటే 1.6 మిలియ‌న్ డాల‌ర్స్ వ‌సూలు చేయాలి. మరి నాని సినిమా అంత చేస్తుందా? అనే సందేహం వెంటాడుతుంది క‌దా!.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article