మళ్లీ టెన్షన్ లో పడిపోయిన నాని..

46
Nani in tention
Nani in tention

Nani in tention

నటుడుగా సత్తా చాటి ఎంటర్టైన్మెంట్ లో ఎక్స్ పర్ట్ అనిపించుకున్న స్టార్ కు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు. దానికి అదనంగా నేచులర్ స్టార్ అన్న ట్యాగ్ నూ సొంతం చేసుకున్నాడు నాని. మాగ్జిమం గ్యారెంటీ హీరోగా తనకంటూ తిరుగులేని మార్కెట్ కూడా ఉంది. కానీ మార్కెట్ నిలవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో ఎంటర్టైన్మెంట్ కు ఏ లోటూ లేకుండా చూస్తానని మాటిచ్చిన నాని ఆ మాట తప్పుతున్నాడా అంటున్నారు విశ్లేషకులు. మరి రాబోయే నాని సినిమాలైనా ఈ విషయంలో మాట తప్పకుండా ఉంటాయా..?
సినిమా ఇండస్ట్రీలో ఏ నటుడైనా తనకంటూఓ ఇమేజ్ ను తెచ్చుకోవడం అంత సులభం కాదు. అలాగే వచ్చిన ఇమేజ్ ను నిలబెట్టుకోవడం కూడా. ఈ విషయంలో నానిని మెచ్చుకోవాలి. ఫ్యామిలీ స్టార్ అన్న ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకూ దానికి బీటలు రాకుండా చూసుకున్నాడు. అయితే ఎప్పుడూ ఒకే మూసలో ఉన్నా ఇబ్బందే. అది మార్చుకుందామనే ప్రయత్నంలో చేసిందే నాని 25వ సినిమా వి. బట్ ఈ మూవీ ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది అనేది నిజం. ఫస్ట్ టైమ్ ఓటిటిలో విడుదలైన పెద్ద సినిమాగా వచ్చినా.. ఆ స్థాయిలో మెప్పించడంలో సక్సెస్ కాలేదు. వి లో నాని తనకు సూట్ కాని సూట్ వేసుకున్నాడని చాలామంది భావించారు కూడా.

మొత్తంగా ఇకపై వచ్చే సినిమాలపై వి ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. వి తర్వాత నాని నుంచి వచ్చే సినిమా టక్ జగదీష్. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. ఇందులోనూ ఎక్స్ పర్మంటల్ సీన్స్ ఉన్నాయట. కానీ వి రిజల్ట్ ను దృష్టిలో పెట్టుకుని వాటికి కోతపెట్టారంటున్నారు. అలాగే శ్యామ్ సింగ్ రాయ్.. ఇది కూడా నాని శైలికి పూర్తి భిన్నమైన సినిమానేనట. కాకపోతే అతని ఇమేజ్ కు తగ్గట్టుగా మళ్లీ మార్పులు మొదలయ్యాయి అంటున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు మెంటల్ మదిలో, బ్రోచెవారెవరురా ఫేమ్ వివేక్ ఆత్రేయతోనూ ఓ సినిమా ఉంది. ఈ మూడు సినిమాలతో పాటు ఓ కొత్త దర్శకుడితోనూ నాని రీసెంట్ గా కమిట్ అయ్యాడు. అయితే ఈ సారి వచ్చే సినిమలన్నిట్లోనూ ఆడియన్స్ తననుంచి ఎక్స్ పెక్ట్ చేసే ఎంటర్టైన్మెంట్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నాడట. ప్రయోగాలు చేసినా ఎంటర్టైన్మెంట్ మిస్ కావొద్దని దర్శకులకు గట్టిగా చెబుతున్నట్టు టాక్. ఏదేమైనా వి నానిని బాగా ఇబ్బంది పెట్టి ఉంటుంది. లేదంటే ఆల్రెడీ ఒప్పుకుని.. కొంత షూటింగ్ కూడా పూర్తయిన సినిమాల్లో మళ్లీ మార్పులు ఎందుకు చేస్తారు. మరి ఈ మార్పులతో ఆ సినిమాలు ఆడియన్స్ ను ఎంత ఎట్రాక్ట్ చేస్తాయో చూడాలి.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here