Nani acting with Nithin Heroin
నేచురల్ స్టార్ నాని 24వ సినిమాను ప్రకటించేశారు. `13బి`, `ఇష్క్`, `మనం`, `24`, `హలో` చిత్రాలకు దర్శకత్వం వహించి.. సెన్సిబుల్, సక్సెస్‌ఫుల్ డైరక్టర్‌గా పేరు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. `శ్రీమంతుడు`, `జనతా గ్యారేజ్`, `రంగస్థలం`… వరుసగా సెన్సేషనల్ హిట్స్ తో హ్యాట్రిక్ అందుకున్న భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఫిబ్రవరి 19 నుండి సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మేఘా ఆకాశ్ పేరుని హీరోయిన్‌గా పరిశీలిస్తున్నారట. అంతా ఓకే అయితే.. లై, ఛల్ మోహన్‌రంగ సినిమాల తర్వాత మేఘా ఆకాశ్ నటించే తెలుగు చిత్రమిదే అవుతుంది.