Nani Movie was Inspired from Hollywood movie
నేచురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కె,కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 19నుండి షూటింగ్ జరగబోతుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు. అందులో ఒక హీరోయిన్‌గా ప్రియా ప్రకాష్ వారియర్ పేరు పరిశీలనలో ఉంది. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమా హాలీవుడ్ సినిమా `ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజిమెన్ బటన్` స్ఫూర్తితో తెరకెక్కనుంది. వివరాల ప్రకారం ఈ చిత్రంలో నాని మూడు షేడ్స్‌లో కనపడబోతున్నాడు. యంగ్ లుక్.. మిడిల్ ఏజ్డ్ లుక్.. వయసైన లుక్‌లో నాని నటిస్తాడని ఫిలింనగర్ వర్గాల టాక్. ప్రస్తుతం నాని `జెర్సీ` చిత్రీకరణతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా ముగియగానే విక్రమ్‌కుమార్ సినిమాను మొదలు పెడతారు.