నాని సినిమాకు మిడిల్ క్లాస్ సెంటిమెంట్

40
nani movie
nani movie

nani movie

మల్టీస్టారర్స్ అనగానే ఇద్దరు హీరోలకు సమానమైన స్క్రీన్ స్పేస్ ఉండాలి అని అంతా భావిస్తారు. అయితే కొన్ని మల్టీస్టారర్స్ కు అది మినహాయింపు. ముఖ్యంగా కథలకు సరెండర్ అయ్యే హీరోలకు ఈ ఇబ్బంది ఉండదు. అలా ఫస్ట్ టైమ్ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రతో రాబోతున్నాడు నాని. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ మూవీ ‘వి’. నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా నటించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేసిన వి సమ్మర్ లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. దీంతో మళ్లీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆసక్తి అందర్లోనూ ఉంది. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ ఈ మధ్య ఓటిటిలో విడుదలవుతుంది అని బలంగా వినిపిస్తోంది. ఒక బడ్జెట్ వరకూ ఓటిటి సేఫ్ గానే ఉంటుంది. కానీ అది దాటిన తర్వాత ఆ ప్లాట్ ఫామ్ అనుకున్న రెవిన్యూ ఇవ్వదు. బిజినెస్ లెక్కల్లో ఆరితేరిన దిల్ రాజు వంటి వారికి ఇది కొత్తగా చెప్పక్కర్లేదు. అందుకే ఎన్ని రూమర్స్ వచ్చినా.. తమ సినిమాను ఓటిటిలో విడుదల చేయం అని ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నాడట. మరి ఇప్పుడు థియేటర్స్ లేవు కదా.. ఎప్పుడు విడుదల చేస్తారు.. అనే అనుమానం అందర్లోనూ వస్తోంది. ప్రధానంగా వి టీజర్ నుంచి.. పాటల వరకూ ఆడియన్స్ లో ఓ రకమైన క్యూరియాసిటీ పెంచింది.

అందుకే మూవీపైనా అంచనాలున్నాయి. ఆలస్యం అంచనాలను తగ్గించే ప్రమాదం ఉన్నా.. ఇప్పుడు అసలు థియేటర్సే లేవు కాబట్టి ఆ గొడవేం లేదు. వి చిత్రాన్ని ఈ యేడాది డిసెంబర్ లో క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం. ఇప్పటికే సమ్మర్ లో రావాలనుకున్న కొన్ని సినిమాలు సంక్రాంతికి వస్తున్నామని ప్రకటించాయి. దీంతో వి కూడా సంక్రాంతి బరిలో ఉంటుందనుకున్నారు. బట్ దిల్ రాజు స్ట్రాటజీ వేరే ఉంది. మూవీని క్రిస్మస్ కే తీసుకురావాలనుకుంటున్నాడు. డిసెంబర్ వరకూ థియేటర్స్ ఓపెన్ అయితే నాని, నివేదా, ఇంద్రగంటి, సుధీర్ బాబు వంటి క్రేజీ కాస్టింగ్ సినిమాపై ఆసక్తిని డబుల్ చేస్తుంది. అలాగే ఆ టైమ్ కు ఓవర్శీస్ లో కూడా క్రిస్మస్ శెలవులు ఉంటాయి. అలా రెండు రకాలుగానూ కలిసొస్తుందనే దిల్ రాజు ఈ ఆలోచన చేశాడట. పైగా నానితో తను నిర్మించిన ఎమ్.సి.ఏ కూడా క్రిస్మస్ కే విడుదలై పెద్ద విజయం సాధించింది కదా.. ఆ సెంటిమెంటూ వర్కవుట్ అవుతుందనే ఆలోచన కూడా కావొచ్చు. ఏదేమైనా వి మూవీ ఓటిటిలో రాదు.. ఆలస్యమైనా థియేటర్స్ లోనే విడుదల చేస్తాం అనేది మొత్తం టీమ్ నిర్ణయం అంటున్నారు.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here