`ఎం.సి.ఎ` కాంబో మళ్లీ సెట్ అవుతోందా? వచ్చే యేడాదిలో ఆ కాంబోలో సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయా? అన్నీ అనుకున్నట్టు కుదిరితే సాధ్యమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. నానిని దృష్టిలో ఉంచుకుని ఆయనతో ఎం.సి.ఎ సినిమా చేసిన శ్రీరామ్ వేణు ఓ కథ సిద్ధం చేశాడు. ఆ కథకి తమ్ముడు అనే పేరు కూడా పెట్టాడు. అఖిల్ కోసం ఆ కథ అని మొదట
ప్రచారం సాగినప్పటికీ తాజాగా నాని కోసమే అనే విషయం వెలుగులోకి వచ్చింది. వేణు ఈ కథని ఎవ్వరితోనైనా తీయొచ్చని చెబుతున్నాడట.దాంతో నిర్మాత దిల్‌రాజు ఆ కథని నానితోనే చేద్దామనే నిర్ణయానికొచ్చినట్టు సమాచారం. నానితో ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన చర్చించినట్టు కూడా తెలుస్తోంది. కానీ నాని చేతిలో ప్రస్తుతం బోలెడన్ని ప్రాజెక్టులున్నాయి.
కొత్త దర్శకులతో పాటు, వివేక్ ఆత్రేయ, హను రాఘవపూడిలతో సినిమాలు చేయాలనే ప్లానింగ్‌లో ఉన్నారు.అందుకే శ్రీరామ్ వేణుతో ఆయన ఇప్పట్లో సినిమా చేయకపోవచ్చని మరో టాక్. దాంతో దిల్‌రాజు ఇదే కథని తమిళ హీరోలతో చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈమధ్య తమిళ ఇండస్ట్రీతో మాంచి టచ్‌లో ఉన్నారు దిల్‌రాజు. ఆయన అడిగితే కాదనేవాళ్లు ఎవ్వరూ ఉండరు.మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఏ రకంగా పట్టాలెక్కుతుందనేది చూడాలి.