అమెజాన్ లో నాని‘వి’..

43
Nani in tention
Nani in tention

nani V in amazon

లేదు లేదంటూనే ఇవాళా రేపూ సినిమాలన్నీ డిజిటల్ ప్లాట్ ఫామ్ కు వస్తున్నాయి. నిన్నా మొన్నటి వరకూ కాదు కాదు అన్న ఓ మీడియం రేంజ్ పెద్ద సినిమా చివరికి అమెజాన్ లో స్ట్రీమ్ కాబోతోంది. ఇందకు సంబంధించిన అన్ని కార్యక్రమాలూ పూర్తయ్యాయి. స్ట్రీమింగ్ డేట్ కూడా అనౌన్స్ చేయడంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మామూలుగా ఈ మూవీ బిజినెస్ గురించి వేసుకున్న లెక్కలతో పోలిస్తే డిజిటల్ లో విడుదల కాదు అనుకున్నారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ.. స్మార్ట్ స్క్రీన్ పై విక్టరీ చూపించబోతున్నారు ‘వి’ స్టార్స్.. వి.. ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్ట్ చేసిన సినిమా. దిల్ రాజు నిర్మించాడు. నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించారు. నానికి ఇది 25వ సినిమా కావడం విశేషం అయితే.. ఈ మూవీలో అతను నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర చేయడం మరో విశేషం. మొత్తంగా ఈ మూవీ సమ్మర్ బరిలో విడుదల కావాల్సింది. డేట్ కూడా అనౌన్స్ చేశారు. కానీ అనుకోకుండా వచ్చిన కరోనా వి విక్టరీకి అడ్డుకట్ట వేసింది. అప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. వి సినిమాకు 35-40 కోట్లకు పైనే బడ్జెట్ అయింది. మార్కెట్ కూడా ఆ రేంజ్ లో ఉండాలంటే కేవలం థియేట్రికల్ బిజినెస్ మాత్రమే కాకుండా శాటిలైట్, డిజిటల్.. నానికి ఉంది కాబట్టి ఓవర్శీస్ అంటూ సులువుగానే నిర్మాతలు సేఫ్ అయిపోయేవారు.

కానీ కరోనా వల్ల ఏదీ కాకుండా పోయింది. అయితే ఈ అన్నిటికీ కలిపి వచ్చే మార్కెట్ రేంజ్ ఫిగర్ ను లేటెస్ట్ గా అమెజాన్ ప్రైమ్ చెప్పిందట. దీంతో మూవీ టీమ్ బెండ్ అయిపోయిందంటున్నారు. మామూలుగా నానికి ఈ ప్లాట్ ఫామ్ లో సినిమా విడుదల కావడం ఇష్టం లేదనే వార్తలూ వచ్చాయి. కానీ థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయనేది ఎవరికీ తెలియదు. మరి అప్పటి వరకూ వెయిట్ చేయడం కంటే సినిమాను అమ్మేయడమే బెటర్ అనేది నిర్మాతల వెర్షన్. ఇక కొన్నాళ్లుగా తమ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల చేయం అని చెబుతూ వచ్చిన టీమ్ చివరికి అమెజాన్ కు అమ్మేసింది. అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 5న వి స్ట్రీమ్ కాబోతోంది. యస్.. నాని సినిమా అమెజాన్ లో రాబోతోంది. ఇక ఈ సినిమాతో మిగతా మీడియం రేంజ్ సినిమాలు కూడా డిజిటల్ వైపు వచ్చేస్తాయని వేరే చెప్పక్కర్లేదు. కాకపోతే అన్ని సినిమాలకు నాని లాంటి నేచురల్ పాయింట్స్ ఉండవు కదా. ఏదేమైనా నాని, సుధీర్ బాబు నటించిన వి సెప్టెంబర్ 5న థియేటర్స్ తో పనిలేకుండానే ప్రేక్షకుల ముందుకు ఇళ్లల్లోకే రాబోతోంది.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here