Nani V Movie Teaser
నేచురల్ స్టార్ నాని.. ఫస్ట్ టైమ్ విలన్ గా నటిస్తున్నాడు అనగానే చాలామంది సాఫ్ట్ కోర్ గా కనిపించే విలనీ చేస్తున్నాడేమో అనుకున్నారు. కాన ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో రూపొందుతోన్న ‘వి’ సినిమా టీజర్ చూసిన తర్వాత అతను కోల్డ్ బ్లడెడ్ మర్డరర్ గా కనిపిస్తున్నాడు. ఓ రకంగా నాని భయపెడుతన్నాడనే చెప్పాలి. సీరియల్ కిల్లర్ తరహా పాత్రలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది నానికి ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. అరగంట నుంచి 40 నిమిషాల పాటు మాత్రమే సాగే పాత్ర. అటు హీరోగా నటించిన సుధీర్ బాబు సైతం మేకోవర్ తో ఆశ్చర్యపరుస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాడు. నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్ లు గా నటిస్తోన్న ఈ మూవీ ఇంతకు ముందు వచ్చిన ఇంద్రగంటి తరహా సినిమాలకు కంప్లీట్ కాంట్రాస్ట్ గా కనిపిస్తోంది.. అతన్నుంచి ఈ తరహా యాక్షన్ ఎంటర్టైనర్ ను ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. దీంతో ఇది ఓ రకంగా షాకింగ్ అండ్ స్వీట్ సర్ ప్రైజ్ గానే కనిపిస్తోంది.
మార్చి 25న విడుదల కాబోతోన్న ‘వి’కి విక్టరీ తథ్యం అనేలా కనిపిస్తోందీ టీజర్. సింపుల్ గా ఉన్నా బలమైన డైలాగ్స్ తో నాని, సుధీర్ బాబు మధ్య వచ్చిన కాన్వర్జేషన్ టీజర్ కే హైలెట్ అని చెప్పాలి. మొత్తంగా నానికి 25వ సినిమాగా వస్తోన్న వితో సమ్మర్ బొనాంజా గ్రాండ్ గా ఆరంభం అయ్యేలానే ఉంది.