నాని అంటే ఇప్పటిదాకా మనింట్లో కుర్రాడు… పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడనే ఇమేజ్‌తోనే చూశాం. కానీ ఆయన అప్పుడప్పుడూ మాస్ ప్రయత్నాలు కూడా చేస్తూ వచ్చాడు. అందులో `శ్యామ్ సింగరాయ్`తో కొంతవరకూ సక్సెస్ అయ్యాడు. మాస్ అవతారాల్లో ఇంకా పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయినా అప్పుడే ఊర మాస్ అవతారంలోకి దూరిపోయాడు. దసరా సినిమానే అందుకు వేదిక చేసుకున్నాడు. సింగరేణి బ్యాక్ డ్రాప్ కావడం,సరైన కథ కుదరడంతో సినిమాలోని డైలాగ్‌లాగా `ఎట్లైతే అట్టగాని సూస్కుందాం` అంటూ ఓ గట్టి ప్రయత్నమైతే చేశాడు.మరి అది ఎంతవరకు
సక్సెస్ ఇస్తుందో చూడాలి.
ట్రైలర్ చూస్తే మాత్రం…సినిమా బ్యాక్‌డ్రాప్..నాని ఫెరోసియస్ అవతారం సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. సమ్‌థింగ్ ఈజ్ దేర్ అన్న క్యూరియాసిటీని కలిగించింది. కథ ఏమాత్రం ఆకట్టుకునేలా ఉన్నా సినిమా హిట్టయినట్టే. నాని గెటప్పు, ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయిన విధానం బాగానే ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందనేది ఈ నెల 30నే చూద్దాం. మంగళవారమే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. కీర్తి మాస్ డైలాగ్‌తో మొదలయ్యే ట్రైలర్‌లో సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.నాని కత్తి పట్టి చేసిన హడావుడి అదుర్స్ అనిపిస్తోంది. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల
తెరకెక్కించారు. నానికి జోడీగా కీర్తి నటించింది.