టక్ జగదీష్ ఎందుకు వాయిదా?

Natural Star Nani’s Tuck Jagadish will not be coming on the previously planned date of April 23rd. Not just because of increase in corona cases, the film is getting pushed due to ticket price limits enforced in Andhra Pradesh.

157
No long delay in Tuck Jagadish release
Nani’s Tuck Jagadish Release Postponed

ఊహించిందే జరిగింది. కరోనా దెబ్బకు బలైన నటుడు తెలుగు ఎవరైనా ఉన్నారా? అంటే ముందు వరుసలో నాని పేరే ఉంటుంది. గతేడాది ’వి‘ సినిమా విడుదలను కొవిడ్ దారుణంగా దెబ్బ తీసింది. ఇక తప్పదన్నట్లు ఆ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. మళ్లీ, ఏడాది తర్వాత నాని సినిమానే కరోనా వల్ల వాయిదా పడింది. వాస్తవానికి, టక్ జగదీష్ సినిమా ఏప్రిల్ 23న విడుదల కావాల్సి ఉంది. ఈ విషయంలో నేచురల్ స్టార్ నాని స్పష్టతనిచ్చారు. కరోనా కేసులు పెరగడం వల్ల వాయిదా వేయడం లేదని తెలిపారు. సినిమా టికెట్ల ధరల విషయంలో పరిమితుల్ని విధించడం వల్లే సినిమా విడుదలను వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. అంతే కాకుండా, టక్ జగదీష్ ట్రైలర్ కూడా మంగళవారం విడుదల చేయడం లేదని తెలిపారు. మరెప్పుడు ట్రైలర్ విడుదల చేస్తారనే విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. సినిమా విడుదల తేదీని ప్రకటించినప్పుడే ట్రైలర్ రిలీజ్ చేస్తామని తెలిపారు. టక్ జగదీష్ రీరికార్డింగ్ పనులు చివరి దశలో ఉన్నయాని, సినిమా ఔట్ పుట్ చూసి చిత్ర యూనిట్ సంతోషంగా ఉందన్నారు. సినిమా విడుదలలో ఎక్కువ జాప్యం జరగదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here