చీకటి మంత్రి నారాయణ

 Narayana From Nellore … ఎందుకో తెలుసా

ఏపీలో ఎన్నికల సమయంలో అందరిదీ ఒక బాధ అయితే మంత్రి నారాయణది మరో బాధలా వుంది. రానున్న ఎన్నికల నేపధ్యంలో నెల్లూరు నుండి ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్న మంత్రి నారాయణ నెల్లూరు జిల్లాపై పూర్తిగా దృష్టి సారించారు. అయితే సమయం కాని సమయంలో ఆకస్మిక తనిఖీలు చెయ్యటం వల్ల మంత్రి నారాయణకు చీకటి మంత్రి అని పేరు పెట్టేశారు అధికారులు. ఆయన ఎప్పుడు ఆకస్మిక తనిఖీలు చేసినా అర్ధ రాత్రి , అపరాత్రి సమయం సందర్భం లేకుండా చేస్తారని నెల్లూరు జిల్లాలో ఒక టాక్ వుంది . ఈ నేపధ్యంలోనే ఆయన తనపై వస్తున్న విమర్శలను తెలిపి తన గోడు వెళ్లబోసుకున్నారు.
నెల్లూరు నగర పర్యటనలో ఏపీ మంత్రి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.! నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆకస్మిక తనిఖీల చేశారు. గతంలో మంత్రులుగా పనిచేసిన వారు ఉదయం 11గంటలకి కూడా బయటకి వచ్చేవారు కాదని.. తాను పనిచేస్తుంటే చీకటి మంత్రి అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం ఎంత సేపు పనిచేయడానికి అయినా తాము సిద్ధమని అన్నారు.అయితే మంత్రి టైమ్‌‌ కాని టైమ్‌‌లో ఆకస్మిక తనిఖీలు చేస్తారని.. మంత్రి జిల్లాకు వస్తే అధికారులకు నిద్రలుండవని గతంలో పలుమార్లు నారాయణపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article