న‌రెడ్కో తెలంగాణ టెర్మ్‌ ఏడాది పొడిగింపు

తెలంగాణ రియ‌ల్ ఎస్టేట్ డెవ‌ల‌పర్స్ అసోసియేష‌న్ చీఫ్ అడ్వైజ‌ర్ పీఎస్ రెడ్డి న‌రెడ్కో తెలంగాణ‌కు అధ్య‌క్షుడిగా కొనసాగుతారు.

502

‌రెడ్కో తెలంగాణ సంఘం ప‌ద‌వీకాలాన్ని ఏడాది కాలం పాటు పొడిగించింది. కొవిడ్ ప‌రిస్థితుల నేప‌థ్యంలో, ఈ నిర్ణ‌యం తాజాగా తీసుకున్నారు. శుక్ర‌వారం జ‌రిగిన న‌రెడ్కో ఏడ‌వ వార్షిక స‌భ్య స‌మావేశంలో న‌రెడ్కో తెలంగాణ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. తెలంగాణ రియ‌ల్ ఎస్టేట్ డెవ‌ల‌పర్స్ అసోసియేష‌న్ చీఫ్ అడ్వైజ‌ర్ పీఎస్ రెడ్డి న‌రెడ్కో తెలంగాణ‌కు అధ్య‌క్షుడిగా కొనసాగుతారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ఎం.ప్రేమ్ కుమార్‌, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ గా మేకా శివ‌రామ ప్ర‌సాద్‌, ట్రెజ‌ర‌ర్‌గా సుమంత్ రెడ్డిలు కొన‌సాగుతారు. జాతీయ సంఘం అయిన న‌రెడ్కో కేంద్ర గృహ‌నిర్మాణ మంత్రిత్వ శాఖ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప‌ని చేస్తుంది. దేశ‌వ్యాప్తంగా రియ‌ల్ ఎస్టేట్ పాల‌సీల‌ను త‌యారు చేయ‌డంలో క్రియాశీల‌క పాత్ర పోషిస్తుంది. దీనికి చీఫ్ ప్యాట్ర‌న్‌గా కేంద్ర గృహ‌నిర్మాణ మంత్రి వ్య‌వ‌హ‌రిస్తారు. దీనికి, దేశ‌వ్యాప్తంగా ఛాప్ట‌ర్లు ఉన్నాయి.

  • * ప్ర‌స్తుతం నరెడ్కో తెలంగాణ‌లో తెలంగాణ రియ‌ల్ ఎస్టేట్ డెవ‌ల‌ప‌ర్స్ అసోసియేష‌న్‌, హైద‌రాబాద్ రియ‌ల్ట‌ర్స్ అసోసియేష‌న్‌, గ్రేట‌ర్ సిటీ బిల్డ‌ర్స్ అసోసియేష‌న్‌, తెలంగాణ యునైటెడ్ రిజిస్ట్రేష‌న్ స్టాంప్స్ ఎంప్లాయిస్ అసోసియేష‌న్‌, కూక‌ట్‌ప‌ల్లి జోన్ బిల్డ‌ర్స్ అసోసియేష‌న్‌, న‌రెడ్కో వెస్ట్ జోన్ బిల్డ‌ర్స్ అసోసియేష‌న్ల‌కు చెందిన‌వారంతా స‌భ్యులుగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here