అంగారకుడిపై నాసా రోవర్

4

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) అంగారకుడిపై అద్భుత విజయం నమోదు చేసుకుంది. నాసా పంపించిన పర్సెవరెన్స్ రోవర్ అంగారక గ్రహంపై విజయవంతంగా దిగింది. గురువారం రాత్రి భారత కాలమానం ప్రకారం 2.25 గంటలకు అది అంగారకుడిపై దిగింది. వెంటనే రెండు ఫొటోలు కూడా తీసి నాసాకు పంపించింది. జెజెరో అనే లోతైన బిలం సమీపంలో నాసా రోవర్ దిగినట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆరు చక్రాలతో కూడిన ఆ రోవర్ కనీసం రెండేళ్లపాటు అంగారకుడిపై ఉండి వివిధ పరిశోధనలు చేస్తుంది. రాళ్లు, ఉపరితలాన్ని తొలిచి విశ్లేషణలు చేస్తుంది. తద్వారా అక్కడ జీవం ఏదైనా ఉందా అనే విషయంలో స్పష్టత రానుంది.