నేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వెబ్ సిరీస్‌

National Director Web Series
సింపుల్ స్టోరీ లైన్‌తో క‌థ‌ను ఆస‌క్తిక‌రంగా మ‌లిచి `పెళ్ళిచూపులు` అనే సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌. తొలి చిత్రంతో ప్రేక్ష‌కుల‌, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు. బాక్సాఫీస్ వ‌ద్ద సినిమా తిరుగులేని విజ‌యాన్ని సొంతం చేసుకుంది. నేష‌న‌ల్ అవార్డును కూడా ద‌క్కించుకున్నాడు త‌రుణ్ భాస్క‌ర్‌. ఈ యువ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన రెండో చిత్రం `ఈన‌గ‌రానికి ఏమైంది` క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్‌ను సాధించినా.. త‌రుణ్‌కు పెద్ద‌గా పేరు రాలేదు. ఇప్పుడు త‌రుణ్ భాస్క‌ర్ ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టు వెబ్‌సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌యం ఏంటంటే.. `ఈన‌గ‌రానికి ఏమైంది` స్టోరీలైన్‌తోనే త‌రుణ్‌భాస్క‌ర్ వెబ్ సిరీస్ చేయ‌బోతున్నాడట‌. చేస్తే ఎలా ఉంటుంద‌ని కూడా త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోల్‌ను నిర్వ‌హించి మ‌రీ చేస్తున్న‌ట్లు సినీ వ‌ర్గాల స‌మాచారం.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article