భారి వర్షాల నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అభ్యర్థన మేరకు జాతీయ విపత్తుల స్పందన దళం పదవ బెటాలియన్ ఎన్డి ఆర్ ఏఫ్ కు చెందిన 17 మంది సభ్యుల బృందం కృష్ణా జిల్లా విజయవాడ నుంచి ఈరోజు ఉదయం వరంగల్ కు బృందం చేరుకుంది. ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా వరద ప్రభావం వచ్చినట్లయితే ఆ సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి ఇక్కడకు రావడం జరిగింది.