NATIONAL Womens Party On Parliament Elections … పోటీ ఆ స్థానాల్లోనే
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో దేశంలోనే మొదటి మహిళా జాతీయ మహిళల పార్టీ (NWP) 9 స్థానాల నుంచి పోటీచేసుందుకురంగం సిద్ధం చేసుకుంటుంది.మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ తో ప్రారంభమైన మహిళా పార్టీ లోక్ సభ యుద్ధానికి సిద్ధమవుతోంది.. తెలంగాణాలో ఉన్న 17 స్థానాలకు 9 స్థానాల్లో పోటీచేయనుంది. తెలంగాణాలోని ఆదిలాబాద్, కరీంనగర్, మల్కాజ్ గిరి, మహబూబర్ నగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సికింద్రాబాద్, భువనగిరి స్థానాలలో పోటీ చేయనుంది. 2018 డిసెంబర్ లో అధికారికంగా ప్రారంభించిన ఈ పార్టీకి ఎన్నికల సంఘం గ్యాస్ పొయ్యి గుర్తును కేటాయించింది.
మరో రెండు రోజుల్లో తమ అభ్యర్థులను ప్రకటిస్తామని పార్టీ వ్యవస్థాపకురాలు శ్వేతా శెట్టి తెలిపారు. మొదటిసారి ఎన్నికల్లో పాల్గొంటున్న తమ పార్టీ అభ్యర్థులను నిర్ణయించేందుకు నాలుగు కమిటీలను వేశామని తెలిపారు. ఈ క్రమంలో ఇతర రాజకీయ పార్టీల నుండి మహిళలు సభ్యులు.. మహిళా NGO లు అడ్వకేట్స్ జర్నలిస్టు లు తమకు మద్దతు తెలుపుతున్నారని శ్వేత తెలిపారు. రాజకీయాల్లోకి రావటానికి ముందు డాక్టర్ గా పనిచేసిన శ్వేతా శెట్టి 2023 నాటికి తమ పార్టీ మరింత శక్తివంతంగా మారుతుందని ఆమె ధీమా వ్యక్తంచేశారు. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్ మహిళల నుంచి తమకు మద్దతు లభిస్తోంది..కానీ మహిళా పార్టీలోకి వారు ప్రత్యక్షంగా పాల్గొందుకు వెనుకాడుతున్నారన్నారు.తమ పార్టీ అధికారంలోకి వస్తే..మహిళలు..బాలికల సంక్షేమం వెల్లివిరిసేలా సంస్కరణలు తీసుకునేందుకు పాటు పడతామని డాక్టర్ శ్వేత శెట్టి తెలిపారు. మొత్తానికి రాజకీయాల్లో మహిళా శక్తి చాటుతున్నా రాజకీయ్ పార్టీ గా మహిళలతో ఏర్పాటైన పార్టీ కూడా మహిళాలోకం ముందుకు రావటం ముదావహం .