నవీన్ చంద్రను తొక్కేశారా..?

42
Naveen chandra
Naveen chandra

Naveen chandra

అందాల రాక్షసి సినిమాతో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న కుర్రాడు నవీన్ చంద్ర. లుక్ అతనికి ప్లస్ అయింది. ఆ కథకు పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యాడు. నటన కూడా ఆకట్టుకోవడంతో టాలీవుడ్ కు మరో టాలెంటెడ్ హీరో వచ్చాడు అనుకున్నారంతా. ఆ తర్వాత వెంటనే దళం అనే సినిమాతో అదరగొట్టాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద విజయం సాధించకపోయినా.. నవీన్ చంద్ర నటనతో మెస్మరైజ్ చేశాడు. ఆ తర్వాతే అతని కెరీర్ కాస్త గాడి తప్పింది. వరుసగా ఫ్లాపులు వచ్చాయి. అయితే బ్యాక్ ఎండ్ లేకపోవడం వల్ల సరైన కథలు ఎంచుకోలేదు అని అంతా కామన్ గా అనుకున్నారు. బట్ దాని వెనక ఇంకేదో కథ నడిచిందని నవీన్ చంద్ర చెబుతుంటే ఎవరికైనా అర్థం అవుతుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో నెపోటిజం గురించి ఓ రేంజ్ లో గొడవలు జరుగుతున్నాయి. వీటి గురించి మన సోకాల్డ్ హీరోల ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. కానీ తెలుగులో జరుగుతున్నదాని గురించి ఎవరూ మాట్లాడరు. అఫ్ కోర్స్ నెపోటిజం లేని ఫీల్డ్ అనేదే లేదు. అందుకే ఈ విషయంలో ఎక్కడైనా ఒకటే అనుకోవచ్చు. బట్ బాలీవుడ్ లో జరిగితే తప్పు.. ఇతర వుడ్స్ లో జరిగితే ఒప్పు అనే ఫీలింగ్ ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈటిలో ప్రసారమయ్యే పాపులర్ షోస్ లో ఒకటైన అలీతో సరదాగా షో కోసం నవీన్ చంద్రను పిలిపించారు. వచ్చే సోమవారం టెలీకాస్ట్ అయ్యే ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు. అది చూస్తే నవీన్ చంద్రను కావాలనే కొందరు తొక్కేశారని అర్థమౌతుంది.

ఒకప్పుడు ఉదయ్ కిరణ్ కు వచ్చినంత క్రేజ్ అందాల రాక్షసితో సొంతం చేసుకున్నాడు నవీన్. కానీ అది కంటిన్యూ కాలేదు. కారణాలేవైనా.. నాని హీరోగా నటించిన నేను లోకల్(ప్రోమోలో ఈ పదం మ్యూట్ లో ఉంటుంది. కానీ లిప్ సింక్ తెలిసిపోతుంది) సినిమాలో అతని పాత్రకు చాలా అన్యాయం చేశారన్న విషయం చెబితే కానీ తెలియలేదు. అలాగే ఇడియట్ లవర్ ఆఫ్ జూలియట్ అనే సినిమా విషయంలోనూ అంతే. నివేదా థామస్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో ముందు పాటలున్నాయట. కానీ నివేదా తర్వాత నానితో నటించిన జెంటిల్మన్ హిట్ అయింది. దీంతో నవీన్ తో పాటలు చేయను అందట.చేసేదేం లేక డ్యూయొట్స్ లేకుండానే సినిమా విడుదల చేశారు. అతను లైట్ గా చెబితేనే ఇవి తెలుస్తున్నాయి. ఇంక డీప్ గా వెళితే.. ఇలా నవీన్ తో పాటు ఇలాంటి వాళ్లు ఇంకెంతో మంది ఉన్నారన్న విషయం తెలిసిపోతుంది. బట్.. వీరి గురించి, ఇలాంటి సంఘటనల గురించి అంత సీరియస్ గా పట్టించుకునేది ఎవరు..?పట్టించుకుంటే వాళ్లు మళ్లీ టాలీవుడ్ లో ఉండగలరా..? అనేది పెద్ద ప్రశ్నే కాదు.. చాలా పెద్ద మేటర్ కూడా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here