వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్న వెరీ ట్యాలెంటెడ్ నవీన్ చంద్ర ‘బ్లైండ్ స్పాట్’ అనే మరో ఎక్సయిటింగ్ మూవీతో వస్తున్నారు. రాకేష్ వర్మ దర్శకత్వంలో మ్యాంగో మాస్ మీడియా బ్యానర్ పై రామ కృష్ణ వీరపనేని నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ అంచనాలను క్రమంగా పెంచుతోంది. నిర్మాతలు ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్ ఒక థ్రిల్లింగ్ సన్నివేశంతో ప్రారంభమవుతుంది. పనిమనిషి తన భుజాలపై ఒక బిడ్డతో బెడ్‌రూమ్‌లోకి వెళుతుంది. ఓ మహిళ నిర్జీవంగా ఉరి వేసుకున్న దృశ్యం చూసి భయపడుతుంది. పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ వచ్చి కేసుని పరిశీలిస్తాడు. ఇది ఆత్మహత్య కాదు హత్యని చెబుతాడు. తరువాత ప్రతి పాత్ర సిక్రెట్ కలిగి వుంటుంది. నిజమైన హంతకుడు ఎవరు? అనే క్యురియాసిటీని క్రియేట్ చేస్తూ చాలా ఎక్సయిటింగ్ ప్రజెంట్ చేశారు.
దర్శకుడు రాకేష్ వర్మ ట్రైలర్‌ను తొలి ఫ్రేమ్ నుంచే ఉత్కంఠను పెంచుతూ, ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్ లో ఉంచారు. నవీన్ చంద్ర తన పాత్రకు ఇంటెన్స్ అండ్ డెప్త్ యాడ్ చేసి సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ చిత్రంలో రాశి సింగ్, అలీ రెజా, రవివర్మ , గాయత్రి భార్గవి కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ…అందరికీ నమస్కారం. రాకేష్ లాంటి డైరెక్టర్స్ ఇంకా ముందుకు రావాలి. తను చెప్పిన కథ చాలా గమ్మత్తుగా ఉంది. తను కథ చెప్పినప్పుడే సీట్ ఎడ్జ్ కూర్చున్న ఫీలింగ్ కలిగింది. ఈ స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా నాకు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. రాశి చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ చేసింది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఇంత బాగా రావడానికి కారణం సినిమాలో యాక్టర్స్. వీళ్లంతా అద్భుతంగా పెర్ఫామ్ చేయడంతో నా క్యారెక్టర్ కూడా అద్భుతంగా ఎలివేట్ అయింది. ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. కథను నమ్మి ఒక్కొక్క సినిమా చేసుకుంటూ ముందుకు వస్తున్నాను. ఎప్పటిలాగే మీ సపోర్టు ఉండాలని కోరుకుంటున్నాను. ఇది చాలా మంచి థ్రిల్లర్. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. ఈ సినిమా పోస్టర్లో ఒక క్లూ ఉంది. అది కనిపెట్టి నాకు మెసేజ్ చేస్తే వాళ్లతో కలిసి నేను సినిమా చూస్తాను. రాకేష్ ఆలోచన నన్ను కట్టిపడేసింది. ఈ సినిమా కోసం మా టీమ్ అంతా డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసింది. రాకేష్ ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఈ సినిమా చేశాడు. ఈ సినిమా మిస్ అవ్వకండి. చాలా మంచి థ్రిల్లర్ ఇది’ అన్నారు.