నితిన్ కోసం నయనతారను అడుగుతున్నారా..?

158
nayanatara for nitin
nayanatara for nitin

nayanatara for nitin

తెలుగులో నితిన్ కు ఎంత్ స్టార్డమ్ ఉందో.. తమిళ్ లో నయనతారకూ అంతే స్టార్డమ్ ఉంది. అందుకే ఈ విషయం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బట్.. కథ నచ్చి.. తను అడిగిన రెమ్యూనరేషన్ ఇస్తే నితిన్ తో ఏం బాధ బెల్లంకొండ శ్రీనివాస్ తో అయినా రొమాన్స్ కు ఓకే అంటుంది నయన్. అయితే ఇది రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ కాదు. ‘ఆంటీ టైప్’టైప్ క్యారెక్టర్. అందుకే ఆ రెండు విషయాలూ నచ్చినా.. అమ్మడు యస్ అంటుందా అనేదే డౌట్. ఇంతకీ ఇది ఏ సినిమా కోసం అనుకుంటున్నారా.? అంధదూన్ రీమేక్ కోసం. యస్.. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన అంధాదూన్ ను తెలుగులో నితిన్ హీరోగా సొంత బ్యానర్ లోనే రీమేక్ చేస్తున్నారు కదా. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేయబోతోన్న ఈ మూవీలో అక్కడ టబు చేసిన పాత్రకోసం నయనతారను సంప్రదిస్తున్నారట. నిజానికి ఈ సినిమా తెలుగుకు అనుగుణంగా అన్ని మార్పులతో సిద్ధంగా ఉంది. కేవలం టబు పాత్ర కోసమే ఆగుతున్నారు. హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించొచ్చు అనేది ముందే చెప్పారు. టబు పాత్ర ఈ సినిమాలో కాస్త ఎరోటిక్ గానే ఉంటుంది.

మరి అలాంటి క్యారెక్టర్ ను నయనతార చేస్తుందా అనేది డౌటే. అయితే తన నిజంగా ఆ పాత్ర, తెలుగులో చేసిన మార్పులూ నచ్చితే ఓకే చెప్పినా ఆశ్చర్యం లేదు. బట్.. సింపుల్ గా నాలుగైదు కోట్లైనా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఇలాంటి పాత్ర చేసిన తర్వాత మళ్లీ తన కెరీర్ రీ బిల్డ్ చేసుకుని రెగ్యులర్ టైప్ పాత్రలు చేయాలంటే కాస్త టైమ్ పడుతుంది. అందుకే. ఏదేమైనా నయనతార మంచి ఆప్షనే. ఇప్పుడంటే ఆవిడ లేడీ సూపర్ స్టార్ లా మారింది కానీ కెరీర్ ఆరంభించిన మొదట్లోనే గజినీ, ఈ, వల్లభ వంటి సినిమాల్లో అమ్మడు ఎక్స్ పోజింగ్ పరంగా ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో తెలుగు ప్రేక్షకులకూ తెలుసు కదా. బట్.. ఇప్పుడైతే ఈ ఇమేజ్ తోనే తనను ఒప్పించాలి అందుకే కష్టం అనుకుంటున్నారు. కానీ ఒక్కటైతే చెప్పొచ్చు… ఒకవేళ నయన్ ఈ పాత్రకు ఒప్పకుంటే ఎంత రెమ్యూనరేషన్ అయినా ఇవ్వొచ్చు.. ఎందుకంటే తర్వాత సినిమాను సౌత్ మొత్తం రిలీజ్ చేయొచ్చు. కంటెంట్ కూడా యూనివర్సల్ గా ఉంటుంది.. నితిన్ కు బయటి భాషల్లో ఇమేజ్ లేకపోయినా నయన్ చేసిన ఆ పాత్రే అతనికి కాసులు తెప్పిస్తుంది.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here