ఆయన నడిపే బండి…

39
Nayini Narsimhareddy no more
Nayini Narsimhareddy no more

Nayini Narsimhareddy no more

నాయిని నర్సింహారెడ్డి కార్మికుల పక్షపాతి. పేదల నాయకుడు. ఎమ్మెల్యేగా గెలిచినా, మంత్రిగా పనిచేసినా ప్రజలతో మమేకమయ్యేవారు. ఏమాత్రం అర్భాటాలకు పోయేవారుకాదు. అయితే నాయిని నర్సింహారెడ్డికి బుల్లెట్‌ వీరుడిగా పేరుంది. ఆయన 1978 నుంచి చాలా సంవత్సరాలు బుల్లెట్‌పైనే తిరిగారు. ఎమ్మెల్యే అయ్యాక కూడా బుల్లెట్‌పైనే అన్ని కార్యక్రమాలకూ హాజరయ్యేవారు. బుల్లెట్‌ వీరుడిగా పేరొందారు. ఆ తర్వాత బుల్లెట్ నుంచి జీప్ కు మారారు. ఆ బుల్లెట్‌, జీపు నేటికీ ఆయన వద్దే ఉన్నాయి. వాటిని అపురూపంగా చూసుకునేవారట. ఏదైనా రిపేర్ వస్తే దగ్గరుండి చేయించి తన షెడ్డులో భద్రపర్చుకునేవాడని సన్నిహితులు చెప్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here