నయీం బినామీ ఆస్తుల విక్రయం

NAYUM Binami Properties will sold .. నయీం భార్య, అనుచరుల అరెస్ట్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ నయీం మరణించినా నయీం ముఠా కార్యకలాపాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. నయీమ్ బినామీ ఆస్తులను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. నయీం భార్య హసీనా బేగం, గతంలో నయీం అనుచరుడుగా ఉన్న పాశం శ్రీనివాస్, మున్సిఫల్ కౌన్సిలర్ అబ్దుల్ నజీర్‌తో పాటు నయీం సమీప బంధువు ఫహీమ్‌ను కూడ అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల నుండి రూ.88.37 లక్షలు, మూడు కార్లను స్వాధీనం చేసుకొన్నట్టు పోలీసులు తెలిపారు. నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత కొంతకాలం పాటు స్తబ్దంగా ఉన్న ఈ గ్యాంగ్ ఇప్పుడిప్పుడే నయన్ బినామీ ఆస్తులపై కన్నేసి వాటిని తమ పేరు మీదకి మార్చుకుని తిరిగి విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు.

భువనగిరి సమీపంలోని నయీం కు చెందిన భూమి తుమ్మ శ్రీనివాస్ పేరున రిజిస్ట్రేషన్ అయింది. ఈ భూమిని విక్రయించాలని ఈ ముఠా ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు.
ఈ భూమిని కొనుగోలు చేసేందుకు వెంకటేశ్వరరావు ముందుకు వచ్చాడు. ఈ భూమిని రూ.89 లక్షలకు ఐదు ఎకరాల భూమిని విక్రయించాలని నిర్ణయం తీసుకొన్నారు.
ఈ నెల 8వ తేదీన భువనగిరి రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం రావడంతో రిజిస్ట్రేషన్‌ను నిలిపివేసినట్టు రాచకొండ సీపీ తెలిపారు. అయితే ఇంతా జరుగుతున్నా పట్టించుకోని పోలీసులపై, జిరాక్స్ డాక్యుమెంట్ లతో రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులపై ఎంక్వయిరీ జరుగుతుంది.

పలు కమర్షియల్ కాంప్లెక్స్, ఖాళీగా ఉండే స్థలాలను కబ్జా చేసి వారిపేరున రిజిస్ట్రేషన్ చేయించుకుంటు అక్రమాలకు వారు కొనగిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తును కొనసాగిస్తున్నామని రాచకొండ కమిషన్ మహేశ్ భగవత్ తెలిపారు.నయీంకు చెందిన ఆస్తులు ఇంకా ఎక్కడెక్క ఉన్నాయో ఇన్వెస్టిగేట్ చేస్తున్నామన్నారు. కాగా..ఇప్పటికే భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి, సీఐ వెంకన్నను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అటాచ్ చేశారు. నయీం ముఠాకు సహకరించారనే పలువురు పోలీసు అధికారులపై ఆరోపణలున్న నేపథ్యంలో తాజాగా నయీం బినామీ ఆస్తులు తెరమీదకు రావటం సంచలనంగా మారింది .

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article