NDA ANNOUNCE PMKY
- బడ్జెట్ లో ఎన్డీఏ వరాల జల్లు
రైతులపై ఎన్డీఏ సర్కారు వరాల జల్లు కురిపించింది. శుక్రవారం లోక్ సభలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో అన్నదాతలను ఆకట్టుకునే పథకం ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఐదు ఎకరాలలోపు ఉన్న ప్రతి రైతుకూ ఏడాదికి రూ.6వేల ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ మొత్తం నేరుగా రైతుల ఖాతాలో జమ అవుతుందని పేర్కొంది. ప్రధానమంత్రి కిసాన్ యోజనగా పేరు పెట్టిన ఈ పథకానికి సంబంధించిన వంద శాతం నిధులూ కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టంచేసింది. 2018 డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ పథకం అమలు చేయనున్నట్టు తెలిపింది. వెంటనే రైతుల ఖాతాలకు మూడు విడతల్లోగా ఈ మొత్తం జమచేస్తామని వెల్లడించింది. పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 12 కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నట్టు వివరించింది. ఈ మేరకు లోక్ సభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ పేర్కొన్నారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి అనారోగ్యం కారణంగా మధ్యంతర బడ్జెట్ ను పీయూష్ ప్రవేశపెట్టారు.