శిశువు మృతదేహాన్ని పీక్కు తిన్న కుక్కలు

new born baby dead body

హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 13లో దారుణం చోటుచేసుకుంది. ఓ శిశువు తల నడిరోడ్డుపై పడి వుండటం కలకలం రేపింది. మొండెం లేని శిశువు తలను చూసి భయాందోళనకు గురైన స్థానికులు… వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి.. చిన్నారి తలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రోజుల వయసున్న శిశువు తల భాగం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అసలేం జరిగిందోనని టెన్షన్ పడుతున్నారు. కాగా, స్థానికంగా ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించగా.. సమీపంలో ఉన్న స్మశాన వాటిక నుంచి ఓ కుక్క శిశువు తల భాగాన్ని రోడ్డుపైకి తీసుకొచ్చినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. చనిపోయిన మృతదేహాన్ని సరిగ్గా పూడ్చకపోవడంతోనే ఈ దారుణం జరిగిందనే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతదేహం లోతుగా పూడ్చకపోవడంతో.. కుక్కలు తవ్వి మృతదేహాన్ని బయటకు తీసి, పీక్కుతిన్నట్లు తెలుస్తుందని వారు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు పోస్టుమర్టం నిమిత్తం బాడీని హాస్పిటల్‌కు తరలించారు.

tags : new born baby, dead body, dogs, head, police, grave yard

కోర్టు ఆదేశాలతో  ఈడీ చిదంబరం విచారణ

రైతుల బతుకుకు జగన్ భరోసా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *