అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న..అమావాస్య అన్నదాన వితరణ

  • అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న..
    *అమావాస్య అన్నదాన వితరణ
    అల్వాల్:అన్నం పరబ్రహ్మ స్వరూపమని.. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని.. అమావాస్య రోజు అన్నదానం చేయడం ఎంతో శ్రేష్టమైనదని.. మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ లు పేర్కొన్నారు. మంగళవారం అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం 133 డివిజన్ పరిధి అంబేద్కర్ నగర్ బస్ స్టాప్ వద్ద పాలకుర్తి నరేష్ కుమార్ ఆధ్వర్యంలో, ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ అల్వాల్ మండల సహకారంతో నిర్వహించిన అమావాస్య అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై అన్నదాన వితరణ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను నిర్వాహకులు శాలువాతో ఘనంగా సత్కరించి పూలమొక్కల అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్, ఈస్ట్ ఆనంద్ బాగ్ కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, అల్వాల్ టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు నాగేశ్వరావు జనరల్ సెక్రెటరీ బల్వంత్ రెడ్డి, సూర్యకిరణ్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, శ్రీశైలం యాదవ్, శ్రావణ్ ముదిరాజ్, వెంకటేష్ గౌడ్, పి సురేష్, గౌడి చిరంజీవి, అమర్ నాథ్, వై ఎస్ బాబు ఐవిఎఫ్ సభ్యులు బచ్చు చంద్రశేఖర్, పాలకుర్తి నరేష్ కుమార్, గుమ్మడవెల్లి శ్రీనివాస్ గుప్తా, నేలంటి శ్రీనివాస్ గుప్త, పార్థ సారథి, సముద్రాల గీతా గుప్తా, రజిని, పొట్టి నాగేశ్వర్ రావు, సిరిపురం ఆనంద్ బాబు, తేల్కుంట మహేష్, తడక వెంకటేష్, వీరేశం, ఏ ఓం ప్రకాష్, మోహన్ రావు, బాలకృష్ణ, కటకం శ్రీనివాస్, ఆనంద్ కల్యాణి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article