మ‌రో పొలిటిక‌ల్ బ‌యోపిక్‌.. అయితే !

New Political Biopic
బ‌యోపిక్స్‌లో పొలిటిక‌ల్ బ‌యోపిక్స్ వేర‌యా! అనే తీరులో ఇప్పుడు  రాజ‌కీయ నాయ‌కుల బ‌యోపిక్స్ రూపొందుతున్నాయి.మాజీ ప్ర‌ధాని మ‌న్‌మోహ‌న్‌సింగ్‌, బాల్‌థాక‌రే, ఎన్టీఆర్‌, వై.ఎస్‌.ఆర్‌.. ఇలా బ‌యోపిక్స్  సంద‌డి చేశాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోది బ‌యోపిక్ సిద్ధ‌మవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు బిజెపి కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ బ‌యోపిక్ కూడా రూపొందుతోంది. అయితే ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ బ‌యోపిక్ కేవ‌లం యూ ట్యూబ్‌లోనే విడుద‌ల‌వుతుంద‌ట‌. అనురాగ్ భుసారి ద‌ర్శ‌క‌త్వంలో గ‌డ్క‌రీ పేరుతో బ‌యోపిక్ తెర‌కెక్కుతోంది. ఇందులో గ‌డ్క‌రీ చిన్న‌ప్ప‌టి నుండి రాజ‌కీయ ప్ర‌స్థానం వ‌ర‌కు తెర‌కెక్కిస్తున్నారు. రాహుల్ చోప్రా అనే న‌టుడు గ‌డ్క‌రీ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఆరు నెల‌లు పాటు రీసెర్చ్ చేసి ఈ బ‌యోపిక్‌ను చేస్తున్నారు. షూటింగ్ అంతా నాగ‌పూర్‌లోనే చేశారు. మార్చి నెల‌లో సినిమా యూ ట్యూబ్‌లో విడుద‌ల కానుంది.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article