బన్నీ-సుకుమార్ సినిమాకు కొత్త ప్రాబ్లమ్?

new problem for Pushpa?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ ‘పుష్ప’. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య-2 మంచి విజయాలు సాధించాయి. ప్రస్తుతం ఇద్దరూ ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన జోష్ లో మళ్లీ కలిసి సినిమా చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని ఎర్రచందనం స్మగులింగ్ ముఠాల నేపథ్యంలో రూపొందుతోన్న మూవీ ఇది. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక అల్లు అర్జున్ లుక్ కు అద్భుతమైన స్పందన కూడా వచ్చింది. బన్నీ ఇందులో మొదటిసారి ఓ లారీ డ్రైవర్ పాత్రలో ఊరమాస్ గెటప్ లో కనిపిస్తున్నాడు. సుకుమార్ సినిమాల్లో ఉండే నేచురాలిటీతో పాటు రగ్గ్ డ్ గానూ ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సమ్మర్ లోనే మాగ్జిమం షూటింగ్ పూర్తి చేసుకుని దసరా బరిలో విడుదల కావాల్సిన ఈ మూవీకి కరోనా ఎఫెక్ట్ గట్టిగా పడింది. లాక్ డౌన్ కారణంగా అన్ని సినిమాల్లానే షూటింగ్ ఆగిపోయింది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా పుష్పకు మరో కొత్త ప్రాబ్లమ్ రెడీగా ఉందిప్పుడు.
పుష్ప సినిమా కథాంశం ప్రకారంగా ఎక్కువగా అడవుల్లోనే చిత్రీకరించాలి. కానీ ఇప్పుడు రుతుపవనాలు మొదలయ్యాయి. ఊహించినదానికంటే ముందుగానే వర్షాలు సందడి చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో అడవుల్లో చిత్రీకరణ చేయడం.. అది కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తక్కువ క్రూతో తెరకెక్కించడం దాదాపు అసాధ్యం.

పైగా వర్షాల టైమ్ లో అడవుల్లో విపరీతమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. నీటివల్ల పవర్ సప్లై కూడా ప్రాబ్లమ్ అవుతుంది. అలాగే నేలంతా జరుతూ ఉంటుంది. అంతేకాక.. ఈ సినిమాకు జూనియర్ ఆర్టిస్టుల సంఖ్య కూడా కాస్త ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల కొత్త నిబంధనలు కూడా సమస్య అవుతాయి. అందువల్ల వర్షాలు తగ్గేంత వరకూ పుష్ప కేవలం అడవులు లేని పార్ట్ షూటింగ్ చేయాల్సి ఉంటుంది. పాటలతో పాటు ఇతర సన్నివేశాలను మాత్రమే తెరకెక్కించే అవకాశం ఉంటుంది. మళ్లీ వర్షాలు తగ్గిపోయి నేలంతా సాధారణ స్థితికి వచ్చేసరికి టైమ్ పడుతుంది. అంటే సినిమా విడుదల కూడా ఇప్పుడు అనుకుంటున్న దానికంటే కూడా చాలా లేట్ అవుతుంది. ఏదేమైనా ఈ లాక్ డౌన్ లేకుండా ఉంటే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే పార్ట్ అంతా ఎప్పుడో పూర్తయి ఉండేది. మరి సుకుమార్ దీనికి ప్రత్యామ్నాయం చూస్తాడా.. లేక వర్షాలు తగ్గేవరకూ ఆగుతాడా అనేది చూడాలి.

tollywood news

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article