హెర్నియాకు శాశ్వత పరిష్కారం

148
DR DV Ramakrishna Kims Hosp, kondapur

హెర్నియా వ్యాధికి చికిత్స పొందుతున్నా.. వ్యాధి తగ్గినట్టే తగ్గి తిరగబెడుతూ నరకం అనుభవిస్తున్న ఓ మహిళకు అధునాతన “స్కోలా” పద్ధతి చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం చూపి రోగికి స్వాంతన చేకూర్చారు. కిమ్స్ ఆస్పత్రి కొండాపూర్ డాక్టర్లు.. కిమ్స్ ఆస్పత్రి ప్రముఖ డాక్టర్ డివి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వైద్యచికిత్స పద్ధతిని ఆయన ఈ సందర్భంగా వివరించారు.

హైదరాబాద్ కు చెందిన చందానగర్ నివాసి శంకరి(36) అనే మహిళ తీవ్రమైన బొడ్డు హెర్నియా సమస్యతో బాధపడుతూ కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. అయితే బాధితురాలు అంతకు ముందే హెర్నియా సమస్యకు చికిత్స పొందినా మళ్లీ తిరగబెడుతుండడంతో కిమ్స్ డాక్టర్లను సంప్రదించింది. ఆమెను పరీక్షించిన తర్వాత బొడ్డు హెర్నియాతో బాధపడుతున్న మహిళ కు సంప్రదాయ ఓపెన్ సర్జరీ మరియు లాప్రోస్కోపిక్ సర్జరీకి రెండింటికంటే ఎంతో ఉత్తమమైన “స్కోలా” ద్వారా చికిత్సనందించాలని నిర్ణయించాం.

“స్కోలా” :
వివిధ రకాల హెర్నియాలతో పాటు ముఖ్యంగా ఎక్కువగా కనబడే బొడ్డు హెర్నియాకు సంబంధించిన చికిత్స కోసం వాడే ఎంతో అధునాతనమైన పద్ధతి “స్కోలా” (సబ్ క్యూటానియస్ ఆన్లైన్ లాప్రోస్కోపిక్ అప్రోచ్). కడుపులోని సిక్స్ ప్యాక్ కండరాల మధ్య విస్తృతమైన ప్రాంతం ఉన్న వారికి, అదే విధంగా ముఖ్యంగా బొడ్డుహెర్నియా సమస్యతో బాధపడుతున్న రోగులకు పొట్ట క్రింది భాగంలో 3 రంధ్రాలు చేసి చాలా సున్నితంగా చికిత్సను పూర్తి చేసే అధునాతన పద్ధతి.

చికిత్సా విధానం:
ఈ విధానంలో శరీరం పై భాగంలో 2 సెం.మీ కోత మరియు రెండు పక్క భాగాల్లో 5 మి.మీ (0.5 సెం.మీ) 2 రంధ్రాలు చేస్తారు. ఈ రంధ్రాలు కూడా ఎటువంటి గాట్లు లేకుండా 3 చుక్కలు పెట్టినట్లుగా ఉంటాయి. ఈ 3 రంధ్రాల ద్వారా సబ్క్యుటానియస్ ప్లేన్ (చర్మం క్రింద ఉన్న ప్రాంతం కాని కండరాల పైన) ద్వారా శస్త్రచికిత్స జరుగుతుంది. చికిత్సా విధానంలో మిడ్లైన్ హెర్నియాతో పాటు బొడ్డు తాడుకు చికిత్సనందిస్తూ అదే విధంగా మెష్ అనే జాలి వంటి పరికరాన్ని కడుపులో అమర్చి కుట్లు వేస్తారు. ఈ సమస్యకు సంప్రదాయ ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపిక్ వంటి సర్జరీలు చేసినా హెర్నియా మళ్లీ తిరగబెడుతూ చాలా మందిని తీవ్రంగా బాధిస్తుంది. అయితే ఈ కొత్త సాంకేతిక చికిత్సా విధానంలో మాత్రం ఒక్కసారి సర్జరీ చేస్తే మళ్లీ పునరావృతం అయిన సందర్భాలు లేవని డాక్టర్ డివి రామకృష్ణ తెలిపారు.

“స్కోలా” ప్రయోజనాలు :- సంప్రదాయ, లాప్రోస్కోపిక్ సర్జరీల కంటే ఎంతో ఉత్తమమైన సర్జరీ అని డాక్టర్ డివి రామకృష్ణ అన్నారు. “స్కోలా” ప్రయోజనాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. హెర్నియా కు స్కోలా పద్దతిలో చికిత్స పొందిన ఎవరైనా ఒకే రోజులో ఇంటికి వెళ్లి సాధారణ కార్యకలాపాలను యధావిధిగా చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా కడుపు మీదనుంచి చికిత్స చేయడం ద్వారా తర్వాత కూడా ఎటువంటి సమస్యలు ఉండవు. స్కోలా చికిత్స అనంతరం అంతర్జాతీయ లెక్కల ప్రకారం చూసినా హెర్నియా పునరావృతం కాకుండా చాలా విజయవంతమైన పద్ధతిగా చెప్పవచ్చు. అదే విధంగా కిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో కూడా ఇప్పటివరకు ఐదుగురికి ఈ తరహా చికిత్సను విజయవంతంగా పూర్తి చేశాం. ఎటువంటి సమస్యలు లేకుండా పేషెంట్లను వెంటనే డిశ్చార్జి చేయడం ఆనందంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here