ఇవో బాధిత రాజకీయాలు

NEW TYPE POLITICS IN AP

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో శిబిరం రాజకీయాలు షురూ అయ్యాయి. అయితే, ఇవి మెజార్టీ కాపాడుకునేందుకు ఏర్పాటుచేసే ప్రజాప్రతినిధుల శిబిరాలు కాదు.. బాధితుల శిబిరాలు. అధికార పక్షం దాడులకు గురైన బాధితులంటూ తెలుగుదేశం పార్టీ గుంటూరులో తాజాగా బాధితుల శిబిరం ఏర్పాటు చేసింది. అసలు ఇలాంటి వింతైన శిబిరం ఎన్నడూ చూడలేదు. అధికారం కోల్పోయాక ఏం చెయ్యాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇలా కొత్త రకం పబ్లిసిటీ స్టంటు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీని ఇరుకున పెట్టే ఉద్దేశంతో టీడీపీ ఇలా చేసిందంటే అర్థం ఉంది. కానీ అధికార వైఎస్సార్ సీపీ సైతం ఇదే బాట పట్టడం విచిత్రంగా ఉంది. టీడీపీ ఏర్పాటుచేసిన వైఎస్సార్ సీపీ బాధిత శిబిరానికి ధీటుగా వైఎస్సార్ సీపీ సైతం ఓ శిబిరం ఏర్పాటు చేసింది. టీడీపీ బాధితులతో ఈ శిబిరాన్ని నింపింది. ఏకంగా హోంమంత్రి సుచరిత సైతం ఈ శిబిరానికి రావడం గమనార్హం.

ఒకప్పుడు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎమ్మెల్యేలు లేదా ఎంపీలను రిసార్టులకు తరలించి శిబిరాలు ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు పార్టీల బాధితులతో ఇలాంటి శిబిరాలు వెలుస్తున్నాయి. ఫక్లు పబ్లిసిటీ స్టంటే ఇందులో కనిపిస్తోందన్నది బహిరంగ రహస్యం. పైగా ఈ శిబిరాన్ని సందర్శించాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూడా టీడీపీ ఆహ్వానం పంపిందని సమాచారం. దీనిని ఓ రాజకీయ పార్టీ సమస్యగా చూడకుండా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలపాలని, తద్వారా అధికార పక్షం అరాచకాలను ప్రశ్నించాలని స్వయంగా పవన్ కు చంద్రబాబు సూచించినట్టు తెలిసింది. అయితే, పవన్ ఇంకా ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఒకవేళ పవన్.. టీడీపీ శిబిరానికి వెళితే ఆయనపై అధికార పక్షం విమర్శలు పెరగడం ఖాయం. ఇప్పటికే పవన్ ను టీడీపీ ఏజెంటు అని విమర్శిస్తున్న వైఎస్సార్ సీపీ.. తమ ఆరోపణలకు ఇదే నిదర్శనం అని చెప్పడానికి అవకాశం చిక్కుతుంది. మొన్నటి ఎన్నికల్లో ఇదే అంశం జనసేన అవకాశాలను దారుణంగా దెబ్బతీయగా.. పవన్ మళ్లీ ఆ పనిచేస్తే ఇక ఆయన్ను జనం నమ్మే పరిస్థితి ఉండదని అంటున్నారు. మరి ఈ విషయంలో జనసేనుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article