ప్రకాష్ రాజ్, సాయిపల్లవి వెబ్ సిరీస్

46
new web series
new web series

new web series

సినిమాలకు కాలం చెల్లుతుందా లేదా అనేది అప్పుడే ఊహించలేం.. కానీ సినిమాలకు దీటుగా వెబ్ సిరీస్ ల కాలం వచ్చేసిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అందుకే చాలామంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఈ వైపుగా దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో టాప్ స్టార్స్ అనిపించుకుంటోన్న వాళ్లు కూడా ఆలోచించడమే ఇప్పుడు వీటికి పెరుగుతోన్న ఆదరణకు నిదర్శనం. ఇక తమిళ్ లో తొమ్మిది మంది దర్శకులు కలిసి.. తొమ్మిది కథలను సిరీస్ లుగా మలచబోతున్నారు. ఇందులో సూర్య వంటి టాప్ స్టార్, మణిరత్నం వంటి టాప్ డైరెక్టర్ కూడా ఓ సిరీస్ చేస్తున్నారు.  వీరిలాగానే ప్రకాష్ రాజ్, సాయి పల్లవి కూడా మరో కొత్త వెబ్ సిరీస్ లో నటించబోతున్నారు. ఒరిజినల్ స్టోరీస్ ను అద్బుతంగా వెండితెరపై అంతే ‘రా’గాచెబుతూ.. ఎంటర్టైన్ చేస్తూ కమర్షియల్ విజయాలు అందుకుంటో మోస్ట్ థాట్ ప్రోవోకింగ్ డైరెక్టర్ వెట్రిమారన్. రీసెంట్ గా కూడా ధనుష్ ప్రధాన పాత్రలో ‘అసురన్’ సినిమా రూపొందించాడు. ఈ సినిమా ఏకంగా వంద కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. ఈ మూవీనే తెలుగులో వెంకటేష్ హీరోగా ‘నారప్ప’పేరుతో రీమేక్ చేస్తున్నారు.

అలాంటి వెట్రిమారన్ డైరెక్ట్ చేయబోతోన్న సిరీస్ లో ప్రకాష్ రాజ్, సాయి పల్లవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు అనే వార్త సంచలనం సృష్టిస్తోంది. ప్రకాష్ రాజ్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పక్కర్లేదు. అలాగే తన సహజ నటనతోనే తెలుగు తమిళ్, మళయాలంలో ఇప్పటికే తనదైన ముద్రను బలంగా వేస్తోన్న నటి సాయి పల్లవి. వెట్రిమారన్ కథలన్నీ అట్టడుగు జీవుల చుట్టూ తిరుగుతాయి. ఆ కథల్లోనే జీవాన్ని ఆవిష్కరిస్తాడు వెట్రిమారన్. ఈ సారి కూడా ఓ పరువు హత్య నేపథ్యంలోని కథను తీసుకున్నాడు. ప్రకాష్ రాజ్, సాయి పల్లవి తండ్రి కూతురు పాత్రల్లో కనిపిస్తారట. నెట్ ఫ్లిక్స్ లో అత్యంత లావిష్ గా ఈ సిరీస్ ఉండబోతోందని చెబుతున్నారు. మొత్తంగా వెట్రిమారన్ లాంటి దర్శకుడికి ప్రకాష్ రాజ్ ఓకే చెప్పాడంటేనే తెలుస్తోంది. ఈ మూవీతో మరోసారి ప్రకాష్ నట విశ్వరూపం కనిపించబోతోందని. ఏదేమైనా దర్శకుడు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా.. ప్రకాష్ రాజ్, సాయిపల్లవి అనే కాంబినేషన్ చాలు.. మనవాళ్లూ ఈ సిరీస్ చూడ్డానికి. ఏదేమైనా ఈ సిరీస్ న్యూస్ టాక్ ఆఫ్ ది కోలీవుడ్ అయిపోయిందిప్పుడు.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here