157కే కివీస్ ఆలౌట్

NEW ZEALAND ALL OUT FOR 157

  • న్యూజిలాండ్ వెన్ను విరిచిన భారత బౌలర్లు

ఆస్ట్రేలియాలో వన్డే, టెస్టు సిరీస్ లు గెలుచుకుని సమరోత్సాహంతో ఉన్న టీమిండియా.. అదే ఊపు కొనసాగిస్తోంది. నేపియర్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో ఆతిథ్య జట్టు వెన్ను విరిచింది. మన బౌలర్లు విజృంభించడంతో కివీస్ 157 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు గప్తిల్‌(5), మున్రో(7)లను షమీ పెవిలియన్ కు పంపించాడు. తర్వాత టేలర్‌ (24), లాథమ్‌(11)లను చాహల్ ఔట్ చేశాడు. అనంతరం నికోలస్‌(12) వికెట్ జాదవ్ ఖాతాలో పడింది. కళ్లు చెదిరే రీతిలో కుల్దీప్ క్యాచ్ అందుకోవడంతో నికోలస్ పెవిలియన్ కు వెళ్లక తప్పలేదు. దీంతో కివీస్ 107 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కివీస్ సారథి విలియమ్సన్‌(64) మినహా మిగిలినవారెవరూ నిలదొక్కుకోలేకపోయారు. దీంతో న్యూజిలాండ్ 38 ఓవర్లలో 157 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టగా, షమీ 3, చాహల్ 2, జాదవ్ ఒక వికెట్ తీశారు.

SPORTS UPDATES

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article