గొంతు కోసుకున్న నూతన వధూవరులు…

Newly Married Couple Sucide Attempt

పట్టుమని మూడు నెలలైనా కాకముందే నవ దంపతులు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బెంగళూరు లో కలకలం రేపింది. బంధువులు అందరూ షాక్ అయ్యేలా గొంతులు కోసుకున్న నవదంపతులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. దంపతుల ఆత్మహత్యాయత్నంకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని పోలీసులు అంటున్నారు. బెంగళూరు నగరంలోని గిరినగరలో బాలాజీ, సౌమ్య దంపతులు నివాసం ఉంటున్నారు. మూడు నెలల క్రితమే బాలాజీ, సౌమ్య వివాహం జరిగింది. బెంగళూరు నగరంలోని ప్రైవేట్ కంపెనీలో బాలాజీ ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం జరిగిన తరువాత బాలాజీ, సౌమ్య దంపతులు అన్యోన్యంగా ఉంటున్నారని తెలిసింది. మంగళవారం సాయంత్రం బాలాజీ ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్లాడు. తరువాత ఏం జరిగిందో ఏమో నివాసం ఉంటున్న ఇంటిలోనే బాలాజీ, సౌమ్య దంపతులు గొంతులు కోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. సౌమ్య బంధువులు ఆమెకు ఫోన్ చెయ్యగా ఎలాంటి స్పందన లేదు. తరువాత బాలాజీ మొబైల్ కు ఫోన్ చేసినా రిసీవ్ చెయ్యకపోవడంతో వారికి అనుమానం వచ్చి ఇంటి దగ్గరకు వెళ్లి చూడగా విషయం వెలుగు చూసింది. వెంటనే బాలాజీ, సౌమ్య దంపతులను ఆసుపత్రికి తరలించారు. బాలాజీ, సౌమ్య దంపతులకు శాస్త్ర చికిత్స చెయ్యడంతో ప్రాణాలతో బయటపడ్డారని పోలీసులు అంటున్నారు.కుటుంబ సమస్యలతో బాలాజీ, సౌమ్య దంపతులు ఆత్మహత్యాయత్నం చేసి ఉంటారని, ఐసీయులో చికిత్స పొందుతున్న నవదంపతులు కోలుకున్న తరువాత అసలు విషయం తెలుస్తోందని, వారి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని,కేసు విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

tags : Newly Married Couple, Cut Necks, Bengaluru, Balaji, Soumya, Serious, Hospiatal

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పూర్ణిమ అనుమానాస్పద మృతి

దేశంలో ఉల్లి దొంగలు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article