NEXT 4 TO 6 WEEKS IS CRUCIAL
NEXT 4 TO 6 WEEKS IS CRUCIAL

వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉండటంతో వచ్చే నాలుగు నుండి ఆరు వారాలు ప్రజలు సెల్ఫ్ లాక్ డౌన్ లో ఉండాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ రావు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు, చికిత్స, ఇతర ఎలాంటి అనుమానాలకైనా ప్రజలు 104కి కాల్ చేయాలని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి మోసపోకుండా, సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలని తెలిపారు. ప్రభుత్వ పరిధిలో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్స్, రెమిడీస్విర్ సహా అన్ని మందులున్నాయని వీటిలో ఎలాంటి కొరత లేదన్నారు.

క్రిటికల్ కేసులకు మాత్రమే పెద్దాసుపత్రుల అవసరం పడుతుందని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. మైల్డ్, మోడరేట్ లో కరోనా ఉంటే ఆసుపత్రి చికిత్స అవసరం లేదని స్పష్టం చేశారు. అత్యవసరం అయితేనే ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రావాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ జాగ్రత్తలు పాటించాలి.. తనతో పాటు, ఇంట్లో వారిని కాపాడుకోవాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here