తెలంగాణ స‌ర్కార్‌పై ఎన్జీటీ ఆగ్ర‌హం

తెలంగాణ సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై కౌంటర్ దాఖలు చేయడంపై ఎన్జీటి ఆగ్రహం వ్య‌క్తం చేసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ పిటీషన్ పై కౌంటర్ దాఖలులో జాప్యంపై తెలంగాణ ప్రభుత్వంపై ఎన్జీటి ఆగ్రహించింది. సచివాలయం కూల్చివేతకు, కొత్తగా నిర్మాణాలు చేపట్టడానికి పర్యావరణ అనుమతులు లేవంటూ రేవంత్ ఎన్జీటి లో పిటీషన్ దాఖలు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై తెలంగాణ ప్ర‌భుత్వం పెద్ద‌గా స్పందించ‌లేదు. అందుకే, ఎన్జీటీ తీవ్రంగా స్పందించింది. వారం రోజుల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సచివాలయం కూల్చివేతకు పర్యావరణ అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలని ఎన్జీటి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తెలంగాణ ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో తెలుసుకోవాలంటే వారం రోజుల్లోపు తెలిసే అవ‌కాశ‌ముంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article