ఎన్కౌంటర్, మృతదేహాలను పరిశీలించిన NHRC

NHRC to probe Hyderabad encounter

హైదరాబాద్ లో దిశ నిందితుల ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని, అలాగే నిందితుల మృతదేహాలున్న ఆస్పత్రిని  జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్ సీ) సభ్యులు ఈ రోజు సందర్శించారు. ఎన్‌కౌంటర్ పై విచారణ జరపాలని ఎన్ హెచ్ఆర్ సీ డైరెక్టర్ జనరల్ ఆదేశించడంతో సీనియర్ పోలీసు అధికారి ఆధ్వర్యంలోని బృందం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ఈ రోజు ఈ బృందం ఘటనా స్థలితోపాటు మహబూబ్ నగర్ ఆసుపత్రిని సందర్శించి అక్కడ భద్రపరిచిన మృతదేహాలను పరిశీలించింది. మరోవైపు హైకోర్టు కూడా ఈ ఘటన పై విచారణ చేపట్టింది.

వాస్తవానికి నిన్న ఎన్‌కౌంటర్ అనంతరం పంచనామా, పోస్టుమార్టం లాంచనాలు పూర్తి చేసి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని పోలీసులు నిర్ణయించారు. సాయంత్రం మృతుల స్వగ్రామంలో అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేశారు. ఈలోగా హైకోర్టు జోక్యం చేసుకోవడంతో పోలీసుల ప్రయత్నాలకు బ్రేక్ పడింది.ఈ నెల 9వ తేదీ వరకు మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. ఆ రోజున కోర్టు కేసు విచారించనుంది. అదే సమయంలో ఎన్ హెచ్ఆర్ సీ దర్యాప్తు కూడా ప్రారంభం కావడంతో తొమ్మిదో తేదీన కోర్టు ఏదో ఒక విషయం తెలియజేసే అవకాశం ఉంది. దీంతో నిందితుల గ్రామాల్లో పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన దిశ నిందితుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులు, ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం పరిశీలించారు. ఆరిఫ్ మృతదేహాన్ని తండ్రి హుస్సేన్, శివ మృతదేహాన్ని తండ్రి రాజప్ప, చెన్నకేశవులు మృతదేహాన్ని తండ్రి కురుమయ్య, నవీన్ మృతదేహాన్ని తల్లి లక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా మృతుల తల్లిదండ్రులను ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం విచారించింది. సంఘటనా స్థాలంలోనూ, అలాగే ఆస్పత్రిలోని మృతదేహాలను పరిశీలించిన బృందం ఈ నివేదికను కమీషన్ ముందు ఉంచనుంది.

NHRC to probe Hyderabad encounter,disha murder, disha case, encounter, accused encounter , supreem court , petition , NHRC,Team visit , encounter location, hospital

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *