ఎక్స్ పోజింగ్ కాకుండా ఇంకేం చేశావ్‌?

Spread the love

NIDHI AGARWAL IS SEXY IN ISMART SHANKAR

సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చాక… అభిమానుల‌కూ తార‌ల‌కూ అనుసంధానం డైరెక్ట్ గా ఏర్ప‌డిపోయింది. ఇంత‌కుముందైతే… అభిమాన హీరో లేదా హీరోయిన్ ని చూడ్డ‌మే మ‌హ‌ద్భాగ్యం. ఫొటో దొరికితే పండుగే. కానీ, ఇప్పుడు నేరుగా వారితో సోషల్ మీడియాలో ఇంట‌రాక్ష‌న్ అవ‌కాశం ఉంది. ప్ర‌ముఖ తార‌ల ట్విట్ట‌ర్, ఫేస్ బుక్ అకౌంట్ల‌ను ట్యాగ్ చేస్తూ… నేరుగా వారితో అభిప్రాయాలు పంచుకునే వెసులుబాటు వ‌చ్చేసింది. అభిమానుల ప్ర‌శ్న‌ల‌కి చాలామంది తార‌లు స‌మాధానాలు కూడా ఇస్తుంటారు. దీంతో కొంత‌మంది ఆక‌తాయిలు మితిమీరుతున్న సంద‌ర్భాలూ అప్పుడ‌ప్పుడూ క‌నిపిస్తుంటాయి. అలాంటి అనుభ‌వ‌మే ఈ మ‌ధ్య ఇస్మార్ట్ శంక‌ర్ హీరోయిన్ నిధీ అగ‌ర్వాల్ కి ఎదురైంద‌ట‌!

పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న‌ ఇస్మార్ట్ శంక‌ర్ లో నిధీ అగ‌ర్వాల్ హాట్ హాట్ గా న‌టించిన సంగ‌తి పోస్ట‌ర్లూ టీజ‌ర్లు చూస్తేనే అర్థ‌మైపోతోంది! ఈ సినిమాలో గ్లామ‌ర్ డోస్ ని నిధి కాస్త పెంచింది అన‌డంలో సందేహం లేదు. అయితే, ఓ అభిమాని ఆమెకి ట్వీట్ పెడుతూ… ఈ సినిమాలో ఎక్స్ పోజింగ్ కాకుండా ఇంకేమైనా చేశారా అంటూ వెట‌కారంగా ఓ కామెంట్ పెట్టాడ‌ట‌! అత‌గాడి ఉద్దేశం ఏంటంటే.. ఇదొక్క‌టేనా, న‌టించ‌డం లాంటివి ఏవైనా ఉన్నాయా అనేది స‌ర్కాజ‌మ్‌! అయితే, ఈ కామెంట్ కి విసుక్కోకుండా హ‌ర్ట్ అయిపోకుండా నిధి స్పందించింది. సినిమా విడుద‌ల అవుతుంది క‌దా… థియేట‌ర్లో చూడండి, ఏం చేశాన‌ని అక్క‌డ తెలుస్తుంద‌ని రిప్లై ఇచ్చింద‌ట‌. ఎంత అభిమానం అయితే మాత్రం… ఇలాంటి కామెంట్లు సోష‌ల్ మీడియాలో పెట్టేస్తారా అంటూ ఆ వ్య‌క్తిపై కొంద‌రు గుర్రుకుంటున్నార‌ట‌!

TOLLYWOOD MOVIE REVIEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *