మొక్క‌లు నాటిన నిఖ‌త్ జ‌రీన్‌

బాక్సింగ్ దిగ్గజం నిఖత్ జరీన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క‌లు నాటారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో ఆమె మంగ‌ళ‌వారం మొక్క‌లు నాటారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ఇండియా ఛాలెంజ్ అనే కార్య‌క్ర‌మాన్ని చేపట్టడం గొప్ప నిర్ణయమన్నారు. మనకు మంచి ఆక్సిజన్ వాతావరణం లభించాలంటే ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article