నిఖిల్ హీరోగా ఏసియన్ గ్రూప్ భారీ సినిమా

26
nikhil new movie
nikhil new movie

nikhil new movie

కుర్ర హీరోల్లో అతని రూట్ సెపరేట్ గా సాగుతోంది. తొలినాళ్లలో రొటీన్ గా అనిపించినా.. తర్వాత ట్రెండ్ కు తగ్గట్టుగా మారాడు. వైవిధ్యమైన కథలు చేస్తూ.. ఆకట్టుకుంటున్నాడు. ఆ వైవిధ్యమే.. అతని చివరి సినిమా ఏకంగా యేడాది ఆలస్యంగా విడుదలైనా.. కమర్షియల్ గా మంచి హిట్ అందుకుంది. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న ఈ యంగ్ స్టర్.. నిఖిల్ అని ఇంకా చెప్పక్కర్లేదేమో. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోన్న నిఖిల్ హీరోగా లేటెస్ట్ గా మరో మూవీ అనౌన్స్ అయింది.  హ్యాపీడేస్ లో ఓ కుర్రాడిగా మొదలైంది నిఖిల్ ప్రస్థానం. ఆ సినిమాలో మెయిన్ హీరో కాకపోయినా.. తర్వాత ఆ టీమ్ నుంచి వచ్చి హీరోగా నిలదొక్కుకుని తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నది మాత్రం ఇతనే అయ్యాడు. స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ అంటూ వెరైటీ మూవీస్ తో సక్సెస్ ఫుల్ ట్రాక్ ఉన్న నిఖిల్ రీసెంట్ గా అర్జున్ సురవరంతో మరో హిట్ అందుకున్నాడు. 2018లో విడుదల కావాల్సిన అర్జున్ సురవరం 2019లో విడుదలైనా మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం చందు మొండేటి డైరెక్షన్ లో కార్తికేయకు సీక్వెల్ చేస్తున్నాడు.

అలాగే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో కుమారి 21 ఫేమ్ సూర్య ప్రతాప్ డైరెక్షన్ లో 18పేజెస్ అనే సినిమా కూడా మొదలైంది. కరోనా వల్ల కాస్త ఆలస్యం అయింది. ఈ రెండు సినిమాలూ మోస్ట్ ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా నిఖిల్ హీరోగా మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. ఏసియన్ ఫిల్మ్స్ బ్యానర్ లో రాబోతోన్న ఈ మూవీ అతని కెరీర్ లో 20వ సినిమా కావడం విశేషం.ఇప్పటి వరకూ డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగంలో తిరుగులేకుండా ఉన్న ఏసియన్ గ్రూప్స్ ఈ మధ్యే నిర్మాణ రంగంలోనూ దిగింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా మొదలైన లవ్ స్టోరీతో నిర్మాణం మొదలుపెట్టిన ఈ సంస్థ.. రీసెంట్ గా నాగార్జున, ప్రవీణ్ సత్తారు సినిమానూ నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. ఇక లేటెస్ట్ గా నిఖిల్ మూవీ అనౌన్స్ అయింది. అయితే ఈ సినిమాకు దర్శకుడు, హీరోయిన్ తో పాటు ఇతర అంశాలన్నీ త్వరలనే ప్రకటిస్తాం అని చెప్పారు. అన్నట్టు ఇది నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ఉంటుందట. మొత్తంగా ఏసియన్ గ్రూప్ నుంచి లవ్ స్టోరీ తర్వాత వరుస సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారన్నమాట.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here