జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నిమ్మల

309
Nimmala Hot Comments On CM Jagan
Nimmala Hot Comments On CM Jagan

Nimmala Hot Comments On CM Jagan

ఏపీ శాసనమండలి రద్దు నిర్ణయంపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు . సీఎం వ్యవస్థల గొంతు నొక్కడమే కాదు,వ్యవస్థలను మర్డర్ చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. 5కోట్ల మంది ప్రజలు చూస్తుండగా మండలిపై సీఎం హత్యా యత్నం చేశారని ఆయన ఆరోపించారు . మండలిని రద్దు చేయడం అంటే ఎస్సీ, ఎస్టీ , బిసి,మైనార్టీ ల గొంతు నొక్కడమే అని ఆయన మండిపడ్డారు . మండలిలో ఎక్కువ మంది సభ్యులు మైనార్టీ వర్గాల వారే అని అభిప్రాయం వ్యక్తం చేశారు . 58 మంది సభ్యుల్లో సగానికి పైగా బడుగు బలహీన వర్గాల వారే ఉన్నారన్నారు.

బీసీలు ఈ సీఎం ని క్షమించరని నిమ్మల వ్యాఖ్యానించారు . వంశీ,గిరి,పోతుల సునీత,శివనాథరెడ్డి విషయంలో జగన్ నైతికత ఏమైందని ఆయన ప్రశ్నించారు. కూచిపూడి నాట్యం చేస్తే మడం ఎన్నిసార్లు తిరుగుతుందో…అంత కంటే ఎక్కువ సార్లు జగన్ మడం తిప్పుతున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మండలిని రద్దు చేసిన జగన్..రేపో మాపో అసెంబ్లీ ని రద్దు చేస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు . అంతే కాదు రావణాసురుడు రామాయణం చెప్తే ఎలా ఉంటుందో జగన్ విలువల గురించి మాట్లాడితే అలా ఉంటుందని నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు.

Nimmala Hot Comments On CM Jagan,legislative council , repeal,  ap assembly, resolution ,  ycp government , ycp, tdp,Nimmala Rama naidu 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here