తొమ్మిది మంది వద్దే సగం జనాభా సంపద

NINE PERSONS HAVE HALF POPULATION INCOME

  • ఆక్స్ ఫామ్ నివేదికలో ఆసక్తికర విషయాలు

ఈ ప్రపంచంలో ధనిక, బీద తారతమ్యాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఎక్కువ సంపద కొంతమంది చేతిల్లోనూ ఉండిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం మానవ జనాభాలో సగం మంది ఆదాయంతో 29 మంది కోటీశ్వరుల సంపద సమానం కావడం విశేషం. అంటే, దాదాపు 350 కోట్ల మంది జనాభా ఆదాయం కేవలం 29 మంది ఆస్తులతో సమానం అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా మిలియనీర్ల ఆదాయంలో గతేడాది భారీగానే పెరిగింది. ఈ విషయంలో భారత్ కూడా మెరుగ్గానే ఉంది. భారతీయ కోటీశ్వరుల ఆదాయం కూడా గత సంవత్సరం భారీగానే పెరిగింది. 2018లో వారి ఒక రోజు ఆదాయం రూ.2,200 కోట్లకు చేరింది. దేశంలో అత్యంత ధనవంతుల్లో ఒక శాతం మంది ఆదాయం 39 శాతం పెరగ్గా.. దిగువ భాగంలో ఉన్నవారి ఆదాయం మాత్రం 3 శాతం మాత్రమే పెరిగినట్టు అంతర్జాతీయ హక్కుల సంస్థ ‘ఆక్స్ ఫామ్‌’ పేర్కొంది. ప్రపంచంలోని సగం మంది ఆదాయం 29 మంది వ్యక్తుల వద్ద ఉండగా.. మన దేశంలోని సగం జనాభా ఆదాయం కేవలం 9 మంది వ్యక్తుల ఆస్తులతో సమానం కావడం గమనార్హం.

ఆక్స్ ఫామ్ నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా బిలయనీర్ల ఆదాయం గతేడాది 12 శాతం(రోజుకు 2.5 బిలియన్‌ డాలర్లు) పెరగ్గా.. దిగువన ఉన్న పేదల ఆదాయంలో మాత్రం 11 శాతం క్షీణత కనిపించింది. భారత్‌లో 10 శాతం జనాభా(13.6 కోట్ల మంది) 2004 నుంచి అప్పుల్లోనే కొనసాగుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బేజోస్‌ సంపద 112 బిలియన్‌‌ డాలర్లకు చేరుకుంది. ఇక భారత్‌లో పది శాతం ధనికులు జాతీయ ఆదాయంలో 77.4 శాతం కలిగి ఉన్నారు. 2018-2022 మధ్య భారత్‌ నుంచి  కొత్తగా రోజుకు 70 మంది మిలియనీర్లు పుట్టుకువస్తారని అంచనా. గత ఏడాది భారత్‌లో కొత్తగా 18 మంది బిలియనీర్లు వచ్చారు. దీంతో మొత్తం బిలియనీర్ల సంఖ్య 119కి చేరింది. దేశంలోని ఒక శాతం ఉన్న అత్యంత సంపన్నులు వారి  సంపదపై కేవలం 0.5శాతం మాత్రమే అదనంగా పన్ను చెల్లించారు.

INTERNATIONAL UPDATES

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article