ధాన్యం విషయంలో కొర్రిలు పెడుతున్న కేంద్రం

హైదరాబాద్:రైతుబంధు తొలిరోజు 19.98 లక్షల మంది రైతులకు చెందిన 11.73 లక్షల ఎకరాలకు గాను రూ.586.65 కోట్లు జమ అయ్యాయి. రైతుబంధు రెండో రోజు 16.32 లక్షల మంది రైతులకు చెందిన 24.68 లక్షల ఎకరాలకు రూ.1234.10 కోట్లు జమ అయ్యాయిజ ఈ రెండు రోజులలో మొత్తంగా 36.30 లక్షల మంది రైతులకు చెందిన 36.41 లక్షల ఎకరాలకు గాను రూ.1820.75 కోట్లు జమ. రైతుబంధుపై దురభిప్రాయాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు.
10 ఎకరాల లోపు రైతులకు సింహభాగం రైతుబంధు నిధులు అందుతున్నాయి. 92.5 శాతం చిన్న, సన్నకారు రైతులకు రైతుబంధు నిధులు అందుతున్నాయి. గత ఎనిమిది విడతలలో రూ.50.448 కోట్లు సాయం అందించగా, తొమ్మిదవ విడతలో 65 లక్షల మందికి రూ.7508 కోట్లు అందనున్నాయి. మొత్తం రైతుబంధుకు అర్హులు 68.10 లక్షల మంది తేలారు. రాష్ట్రంలో దాదాపు కోటి 50 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం అందుతున్నదని అన్నారు.
మోడీ భారత రైతాంగానికి చేసింది సున్నా. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని రైతుల పెట్టుబడి ఖర్చులు రెట్టింపు చేశారు. సీ2+50 అమలు చేస్తామని ఎ2+ 50 అమలు చేస్తూ రైతులను మోసం చేసి స్వామినాధన్ సిఫార్సులను అవమానిస్తున్నారు. వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతుల పోరాటంతో తోకముడిచి రైతులకు క్షమాపణ చెప్పారు. 60 ఏండ్లు నిండిన వారికి ఫించను ఇస్తామని దాని ఊసెత్తడం లేదు. రైతులకు ఏదో చేస్తామని చెప్పి చెయ్యకపోగా నిస్సిగ్గుగా దబాయిస్తున్నారని అయన అన్నారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన నుండి గుజరాత్ పలు రాష్ట్రాలు వైదొలిగాయి. దీని అమలులో చెల్లించే ప్రీమియం ఎక్కువ .. రైతులకు చెల్లించే పరిహారం తక్కువ .. దీనిని నేను స్వయంగా శాసనసభలో వివరించాను. ప్రధాని సొంత రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదు. బెంగాల్ లో అమలు చేస్తున్న విధానాన్ని అధ్యయనం చేస్తాం .. రైతులకు న్యాయం జరిగేలా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టమంటున్నారు .. యూపీలో వస్తున్న బిల్లులు చూసి ఈ విధానాన్ని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కొర్రీలు పెడ్తున్నది. బీజేపీ పాలిత రాష్ట్రం యూపీలో ఆరు కోట్ల ఎకరాల సాగు అనువైన భూమి ఉన్నది. ఇక్కడ మొత్తం బడ్జెట్ లో వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించింది గత మూడేళ్లుగా 4 నుండి 4.5 శాతమే.
గుజరాత్ లో 2.50 కోట్ల ఎకరాల సాగు అనువైన భూమి ఉండగా అక్కడి బడ్జెట్ లో వ్యవసాయ అనుబంధ రంగాలకు గత మూడేళ్లలో 1.7 శాతం నుండి 2.8 శాతం మాత్రమే కేటాయించారుఅస్సాంలో 70 లక్షల ఎకరాల సాగు అనువైన భూమి ఉండగా అక్కడి బడ్జెట్ లో వ్యవసాయ అనుబంధ రంగాలకు గత మూడేళ్లలో 4.5 శాతం నుండి 5.20 శాతం మాత్రమే. దేశంలోని వివిధ రాష్ట్రాలలో వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయిస్తున్న బడ్జెట్ జాతీయ సగటు 6 నుండి 6.50 శాతం .. బీజేపీ పాలిత రాష్ట్రాలలో కనీసం జాతీయ సగటు కూడా అమలు చేయడం లేదని మంత్రి అన్నారు.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article