మార్చి 3న నిర్భయ దోషులకు ఉరి పక్కానే

126
Nirbhaya Convicts to be Hanged
Nirbhaya Convicts to be Hanged

Nirbhaya Convicts to be Hanged On March 3

నిర్భయ దోషులకు పాటియాలా  కోర్టు ఇటీవలే డెత్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. జనవరి 22న, ఫిబ్రవరి 1 వ తేదీన నిర్భయ దోషులను ఉరి తీయాల్సి ఉన్నపటికి, నలుగురు దోషులు ఒకరి తర్వాత ఒకరు తమకు ఉన్న న్యాయపరమైన అంశాలను వినియోగించుకుంటూ, చట్టంలోని లొసుగులతో ఉరిని పోస్ట్ ఫోన్ చేసుకుంటూ వస్తున్నారు.  మూడోసారి కూడా  వీరు ఉరి నుంచి తప్పించుకోవడానికి ఎత్తులు వేస్తున్నారు.

ఇందులో భాగంగానే ఫిబ్రవరి 16 వ తేదీన నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ తలను గోడకు బాదుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశారు.  ఇది గమనించిన జైలు సిబ్బంది వెంటనే వినయ్ ను హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ చేయించారు.  వినయ్ మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమయంలో ఉరి తీయడం సరికాదని కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఈ పిటిషన్ ను కొట్టేసింది.  మార్చి 3 వ తేదీ ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.  ఉరి తీసేందుకు రెండు రోజుల ముందే తలారిని ఉత్తరప్రదేశ్ నుంచి తీహార్ జైలుకు రావాలని కోర్టు ఆదేశించింది.  ఇక చివరి చూపులుగా నలుగురు దోషులను వారి తల్లిదండ్రులు కలిసే ఏర్పాట్లు చేస్తున్నారు.

Nirbhaya Convicts to be Hanged On March 3,nirbhaya case, death sentence , patiala court , post pone , legal litigations , vinay, suicide attempt, tihar jail,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here