మార్చి3న నిర్భయ దోషులకు ఉరి ..

Nirbhaya Convicts To be Hanged on March 3

మూడోసారి నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ చేసింది కోర్టు . మార్చి-3,2020న ఉదయం 6 గంటలకు ఈ కేసులోని నలుగురు దోషులు ముకేష్,వినయ్,పవన్,అక్షయ్ లను ఒకేసారి ఉరి తీయనున్నారు. ఈ మేరకు ఇవాళ నలుగరు దోషులు కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది ఢిల్లీలోని పటియాలా కోర్టు. కోర్డు డెత్ వారెంట్ జారీ చేయడంపై నిర్భయ తల్లి ఆశాదేవి సంతోషం వ్యక్తం చేశారు. మార్చి-3న నిందితులకు ఉరిశిక్ష పడుతుందని తాను నమ్ముతున్నానని ఆమె అన్నారు.నిందితులను జనవరి-22,2020న ఉరితీయాలంటూ జనవరి-7,2020న కోర్టు బ్లాక్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి-1 ఉదయం 6గంటలకు నలుగురు నిందితులను ఉరితీయాలంటూ జనవరి17,2020న ట్రయల్ కోర్టు రెండోసారి బ్లాక్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే చట్టంలో ఉన్న లొసుగులును ఉపయోగించుకుంటూ నలుగురు దోషులు ఉరిశిక్ష విధింపులో ఆలస్యం చేస్తూ వచ్చారు. ఇప్పటికే రెండుసార్లు డెత్ వారెంట్ జారీ చేసిన కోర్టు రెండుసార్లు డెత్ వారెంట్ రద్దు అవడంతో ఇప్పుడు మూడవసారి డెత్ వారెంట్ జారీ చేసింది.

దేశ రాజధానిలో డిసెంబర్ 16, 2012లో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక దారుణ అత్యాచార సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ ‌కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది.ఈ కేసులో మొత్తం ఆరుగుర్ని దోషులుగా గుర్తించగా..వారిలో ఒకడు… తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక వ్యక్తి మైనర్ కావడంతో… జువెనైల్ చట్టాల ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష తర్వాత రిలీజ్ అయ్యాడు. మిగతా నలుగురూ నిందితులు దోషులైన పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌ లు తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మార్చి-3,2020న నలుగురు నిందితులను ఒకేసారి ఉరితీయనున్నారు. ఇక ఇప్పటికే పలుమార్లు చట్టంలోని లొసుగులతో ఉరి వాయిదా వేస్తూ వస్తున్న వీరికి  ఇప్పుడైన మార్చి-3న ఉరి శిక్ష అమలవుతుందా అన్నది ఉత్కంఠ రేకెత్తిస్తుంది.

Nirbhaya Convicts To be Hanged on March 3,nirbhaya culprits , death sentence, delhi, patiala court , nirbhaya mother , asha devi , tihar jail

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article