దిశ ఎన్కౌంటర్ పై నిర్భయ తల్లి  ఏం చెప్పారంటే

129
Nirbhaya Case
Nirbhaya Case

nirbhaya mother reaction on disha accused encounter

తెలంగాణ రాష్ట్రంలో వెటర్నరీ డాక్టర్ దిశ సామూహిక అత్యాచారం, హత్య అందర్నీ షాక్ కు గురి చేసింది. ఇక ఈ కేసు తెలంగాణలో  మరో  నిర్భయ తరహా ఘటనగా దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది.  మరో అమాయకురాలు కామాంధుల పైశాచికత్వం బలైపోయిందని దేశం మొత్తం వారిని ఎన్ కౌంటర్ చెయ్యాలని నినదించిన వేళ తెలంగాణా ప్రభుత్వం , తెలంగాణా పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు .

దిశ కేసు నిందితులను  దిశను సజీవ దహనం చేసిన చోటే ఎన్ కౌంటర్ చేశారు. ఇక ఈ ఘటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న తరుణంలో నిర్భయ తల్లి ఆశా దేవి స్పందించారు . దిశ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన ఆమె,మన వ్యవస్థలో లోపాల వల్లే ఈ తరహా ఘటనలు పదే పదే ఉత్పన్నమవుతున్నాయి ఇటీవల ఘటన నేపధ్యంలో ఆవేదన చెందారు.
ఇక దిశా కేసు నిందితులను పోలీసులు నేడు ఎన్ కౌంటర్ చెయ్యటంతో ఆమె  తెలంగాణా ప్రభుత్వాన్ని , తెలంగాణా పోలీసులను అభినందించారు. తాను గత ఏడేళ్ళుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని , నేరస్తులకు ఉరి శిక్ష వెయ్యాలని కోర్టుల చుట్టూ తిరుగుతున్నానని చెప్పిన అశాదేవి నిర్భయ కేసులో ఇప్పటికీ తనకు న్యాయం జరగలేదని చెప్పారు. తెలంగాణలో దిశా కేసులో పోలీసులు సత్వర న్యాయం చేశారని చెప్పిన ఆమె ఇలా వెంటనే చర్యలు తీసుకుంటే కచ్చితంగా నేరస్తుల వెన్నులో వణుకు పుడుతుందని ఆమె పేర్కొన్నారు.

తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని, పోలీసులు నిందితులను ఎన్ కౌంటర్  చెయ్యటాన్ని నిర్భయ తల్లి ఆశాదేవి అభినందించారు. దిశ హత్యాచార నిందితులను ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులపై ఎటువంటి విచారణ ఉండరాదని నిర్భయ తల్లి ఆశాదేవి డిమాండ్ చేశారు. ఎన్ కౌంటర్ వార్తను గురించి తెలుసుకున్న ఆశాదేవి  పోలీసులపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలని భావించినా, మరో ఉద్యమం మొదలవుతుందని ఆమె హెచ్చరించారు.పోలీసులు విధించిన శిక్షను చూసి తానెంతో సంతోషించానని పేర్కొన్నారు . వారు తమ విధిని సక్రమంగా నిర్వర్తించారని కొనియాడిన ఆమె, ఈ ఘటనతో మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారికి ఓ కఠిన హెచ్చరిక వెళ్లిందని చెప్పారు ఆశాదేవి .పోలీసులపై ఏ విధమైన కేసులు పెట్టరాదని, విచారించరాదని ఆశాదేవి అభిప్రాయపడ్డారు.దేశంలోని న్యాయ వ్యవస్థ నేరస్తులను శిక్షించడంలో సత్వర నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. తన కుమార్తెను చంపిన వారిని సాధ్యమైనంత త్వరగా ఉరి తీయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

nirbhaya mother reaction on disha accused encounter,disha  muder, encounter, shad nagar , chatan palli bridge , police , cp sajjanar, nirbhaya mother, asha devi 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here