ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్‌లో అత్యుత్తమ మార్కుల్ని సాధించిన ఈ అమ్మాయికి మనమంతా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే, బాల్య వివాహం నుంచి తప్పించుకుని.. అనేక సవాళ్లను ఎదుర్కొని.. వెనకబడిన వర్గాల కోసం స్థాపించిన కర్నూలు కస్తూర్బా గాందీ బాలికా విద్యాలయలో ఇంటర్ చదివిందీ అమ్మాయి. అనేక అవాంతరాల్ని సమర్థంగా అధిగమించి.. 440 మార్కులకు గాను 421 మార్కుల్ని సాధించి సాటి అమ్మాయలకు ఆదర్శంగా నిలిచింది. కార్పొరేట్ కళాశాలల్లో లక్షలు గుమ్మరించినా సాధ్యం కాని ఘనతను.. వెనకబడిన తరగతుల కళాశాలలో చదివి.. ఈ స్థాయిలో మార్కుల్ని సాధించడమంటే సామాన్య విషయమేం కాదు. భవిష్యత్తులో ఐపీఎస్ అధికారి కావాలన్నా జి.నిర్మల కల సాకారం కావాలని మనసారా కోరుకుందాం. ఈ అమ్మాయికి బంగారు భవిష్యత్తు అందాలని శుభాకాంక్షలు చెబుదామా..