నిశ్శబ్దంగా పోయినట్టేనా..?

45
Nishabdam movie review
Nishabdam movie review

Nissabdam review

ఈ మధ్య కాలంలో మోస్ట్ అవెటెయిడ్ అనిపించుకున్న సినిమా నిశ్శబ్దం. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, మాడిసన్ వంటి భారీ తారగణం ఉంది. అనుష్క మూగ యువతి పాత్రలో కనిపిస్తుంది. అంటూ టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్నారు. నిన్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పిన ఈ సినిమా ఆ రేంజ్ లో ఉందా.. విడుదలకు ముందు చెప్పినంత విషయం నిశ్శబ్ధంలో ఉందా..?అంటే లేదనే చెప్పాలి.

సాక్షి (అనుష్క), సోనాలి(షాలినీ పాండే) ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అనుష్క తండ్రి నడిపిన ఆర్ఫాన్ స్కూల్ లోనే ఇద్దరు కలిసి పెరుగుతారు. సోనాలి.. సాక్షికి ఎవరైనా దగ్గర అయితే తట్టుకోలేదు.
పెయింటింగ్ పై చాలా ఇష్టం ఉన్న సాక్షి తన కెరియర్ కోసం సోనాలి కి దూరంగా ఉంటుంది.. అక్కడ మ్యూజిషియన్ ఆంటోనీ కి దగ్గరవుతుంది.. సాక్షి ని వదిలి ఉండలేని సోనాలి ఆమె దగ్గరకు వస్తుంది.. ఒక పెయింటింగ్ కోసం హాంటెడ్ హౌస్ కి ఆంటోనీ, సాక్షి వెళతారు. అక్కడ ఆంటోనీని ఎవరో హత్య చేస్తారు.. సాక్షి షాక్ లోకి వెళ్తుంది.. తనతో ఉండేందుకు వచ్చిన సోనాలి కనిపించదు…? ఆంటోనీ ని ఎవరు హత్య చేశారు..? సాక్షి చూట్టూ ఉన్న ప్రశ్నలకు సమాధానం ఎలా దొరికింది అనేది మిగిలిన కథ..?

ఎలా ఉంది  :
నిశ్శబ్దం కి కావాల్సిన హంగులు అన్నీ ఉన్నాయి. స్టార్ కాస్ట్ కి కోదవే లేదు..లొకేషన్స్ రిచ్ గా ఉన్నాయి.. కానీ థ్రిల్లర్ సినిమాకి ఉండే లక్షణాలు లోపించాయి.. దీంతో కథనంలో ఇంట్రెస్ట్ కనిపించదు. మాధవన్ హత్య తో కథ ను లాక్ చేసిన దర్శకుడు ఆ తర్వాత అలాంటి మూమెంట్స్ ని తెప్పించ లేక పోయాడు.. దీంతో ఈ కథ లో మలుపు లు సగటు ప్రేక్షకుల కు దొరికేస్తాయి.. అవే నిశ్శబ్దానికి ఇబ్బంది గా మారాయి..
అంజలి పాత్ర పెద్దగా చెప్పు కోవడానికి ఏమీ లేదు..పెద్ద గా చేసింది కూడా ఏమి లేదు.. అనుష్క తన పాత్ర కు న్యాయం చేసింది.. అరుంధతి, భాగమతి వంటి సినిమాలతో పోల్చుకుంటే సాక్షి పాత్ర తేలిపోయింది.
సాక్షి మాట్లాడ లేదు.. వినలేదు. ఓ హత్యకు సాక్షిగా ఉన్న పాత్రకు ఇది పెద్ద అస్సెట్. కానీ దీని వల్ల ఆ పాత్ర కు ఒరిగింది ఏమీలేదు.. దీంతో అనుష్క శ్రమ తెరమీద పెద్దగా ఆసక్తి ని కలిగించలేదు.. అనుష్క పాత్రతో దర్శకుడు ఇచ్చిన థ్రిల్స్ పెద్దగా లేవు.. క్లయిమాక్స్ వరకూ కూడా కథ లోని మలుపులు ఆసక్తి ని కలిగించలేదు..
మాధవన్, అనుష్క స్క్రీన్ ప్రాజెన్స్ బాగుంది. ఒకప్పటి హాలీవుడ్ స్టార్ మైకేల్ మ్యాడిసన్ ఈ సినిమా కు ఏ రకం గాను ఉపయోగ పడలేదు..
టెక్నీకల్ గా సినిమాటోగ్రఫీ ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది.
ముఖ్యంగా హారర్ సన్నివేశాల్లో సీన్ లోని మూడ్ ని తన కెమెరా యాంగిల్స్ తో కళ్ళకు కట్టినట్టు చూపించారు కెమెరామెన్. అలాగే గిరీష్ అందించిన నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంది. ఇక ఎడిటింగ్ కూడా బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకున్నాయి.

చివరిగా :
అనుష్క ఇమేజ్ దృష్టి లో పెట్టుకుంటే నిశ్శబ్దం నిరాశ పరుస్తోంది.. థ్రిల్లర్ గా కూడా నిశ్శబ్దం ఇచ్చే కొత్త ఎక్సపీ రియన్స్ లు ఏమి లేవు.. అందుబాటులో ఉంది అనుకుంటే చూడండి.. టైం పాస్ అవకపోతే  ఫారెవర్డ్ ఆప్షన్  ఉండనే ఉంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here