ఎవరికి ‘చెక్?’

CHECK MOVIE REVIEW

యూత్ స్టార్ నితిన్ ప్రయోగాత్మక చిత్ర దర్శకుడు చంద్రశేఖర్ యేలేటితో చేసిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమా “చెక్”. అందాల భామ రకుల్ ప్రీత్, ప్రియా ప్రకాష్ వారియర్ లు కీలక పాత్రల్లో నటించారు. మరి, ఈ సినిమా ఎంతవరకూ ప్రేక్షకులను మెప్పించిందో చూసేద్దామా..

కథలోకి వెళితే ఆదిత్య (నితిన్) కు ఓ కేసు విషయంలో న్యాయ స్థానం ఉరి శిక్ష విధిస్తుంది. దీంతో తనను ఓ జైలుకు తరలిస్తారు. ఆ జైలులో సహచర ఖైదీగా చెస్ ఆటలో ప్రావీణ్యం కలిగిన సాయి చంద్ పరిచయం అవుతాడు. ఆ తర్వాత నుంచి ఆదిత్య అంచెలంచెలుగా ఓ ఖైదీగానే చెస్ లో ఎలా ఎదుగుతాడు? ఇంతకీ అతను చేసిన నేరమేమిటి? ఈ కథలో ప్రియా ప్రకాష్ రోల్ కు ఎంత ప్రాముఖ్యత ఉంది? రకుల్ పాత్ర ఎలాంటి మలుపులు తిప్పింది? చివరిగా ఆదిత్య కేసు ఏమైందనే ప్రశ్నలకు యేలేటి ఎలా సమాధానం ఇచ్చారో తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

నితిన్ పరిణితి చెందిన నటనను కనబరిచాడీ చిత్రంలో. ఓ చెస్ ఇంటెలిజెన్స్ లానే కాకుండా ఖైదీగా ఎండింగ్ వరకు కూడా మంచి సెటిల్డ్ నటనతో ఆకట్టుకుంటాడు. కొన్ని యాక్షన్ సీన్స్ లో కూడా బాగా కనిపించాడు. రకుల్ ఇప్పటి వరకు చేసిన రోల్స్ కన్నా ఇది కాస్త భిన్నంగా అనిపిస్తుంది. లాయర్ గా తాను ఎంటరైన దగ్గర్నుంచి ఎండింగ్ వరకు మంచి నటనను చూస్తాం. మరో హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ కనిపించింది కాసేపే అయినా తన గ్లామర్ సినిమాలో కీలక పాయింట్ తో ఆకట్టుకుంటుంది. నటుడు సాయి చంద్, సంపత్ లు కూడా న్యాయం చేశారు.

మొదట్లో చెప్పుకున్నట్టుగానే యేలేటి ఎంచుకున్న స్క్రిప్ట్ ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ నుంచి సెకండాఫ్ కు వచ్చిన తర్వాత నుంచి సినిమా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా కథానుసారం వచ్చే ట్విస్టులు ఇంప్రెసివ్ గా ఉంది. మొదటి నుంచి హైలైట్ చేసిన చెస్ ఛాంపియన్ ఎపిసోడ్ సీక్వెన్స్ లు ఆసక్తికరంగా అనిపిస్తాయి. వాటికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఉంది.

ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పై తెచ్చిన హైప్ ను సినిమా చూసాక పూర్తి స్థాయిలో అందుకోలేదని అనిపిస్తుంది. ఇలాంటి థ్రిల్లింగ్ ఎక్స్ పెరిమెంట్స్ వచ్చినపుడు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతీ నిమిషం థ్రిల్ చేసే ఎలిమెంట్స్ ను ఆశిస్తారు కానీ ఇందులో సినిమా స్టార్టింగే కాస్త స్లో గా ఉంటుంది. ఇంటర్వెల్ వరకు వచ్చేసరికి సోసో గానే అనిపిస్తుంది. ఇందులో మరో పెద్ద డ్రా బ్యాక్ ఏంటి అంటే సినిమా అంతా ఒకే సీరియస్ టోన్ లో అనిపిస్తుంది కానీ ఎక్కడా బలమైన ఎమోషన్స్ కనిపించవు. ఏదో మిస్సవుతున్నట్టు అనిపిస్తుంది.

 

#CHECK MOVIE REVIEW

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article